జనవిజయంజాతీయంఒకే గ్రామంలో 36 మంది మృత్యువాత

ఒకే గ్రామంలో 36 మంది మృత్యువాత

గ్రామస్థులు ఇంటికే పరిమితం కావడంతో అప్రకటిత కర్ఫ్యూ

పాట్నా,మే19(జనవిజయం): కరోనా మహమ్మారితో ఒకే గ్రామంలో 36 మంది మరణించడంతో ఆ గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలోని సరమస్తాపూర్‌ గ్రామ పంచాయతీలో వెలుగుచూసింది. ముజప్ఫర్‌పూర్‌ జిల్లా సక్రా బ్లాక్‌ లోని సరమస్తాపూర్‌ గ్రామంలో గత 27 రోజుల్లో 36 మంది గ్రామస్థులు కరోనాతో మరణించారు. కరోనా లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరంతో గ్రామస్థులు మరణించడంతో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్థులెవరూ బయటకు రాకపోవడంతో గ్రామంలో అప్రకటిత కర్ఫ్యూలా మారింది. తమ గ్రామంలో కరోనా లక్షణాలతో 36 మంది మరణించినందున గ్రామంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని తాను వైద్యాధికారులకు విన్నవించానని గ్రామ సర్పంచ్‌ చెప్పారు. కరోనా పరీక్షలు టెస్టింగ్‌ కిట్లు లేవని అధికారులు పరీక్షలు చేయడం లేదని సర్పంచ్‌ చెప్పారు. కరోనా పరీక్షలకు వాడే యాంటీజెన్‌ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు బ్లాక్‌ మార్కెటుకు తరలించగా సక్రా పోలీసులు దాడి చేసి వాటిని సీజ్‌ చేశారు. కాగా గ్రామంలో ఇతర వ్యాధు వల్ల మరణించారని, కరోనా కారణం కాదని సక్రా ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి సంజీవ్‌ కుమార్‌ అంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి