జనవిజయంతెలంగాణఓయూ వి.సిగా ప్రొఫెసర్ రవిందర్ బాధ్యతలు స్వీకరణ

ఓయూ వి.సిగా ప్రొఫెసర్ రవిందర్ బాధ్యతలు స్వీకరణ

 ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే బాల్క సుమన్

హైదరాబాద్, మే24(జనవిజయం): రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.రవీందర్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయన వినిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వినిని ఘనంగా సన్మానించారు. గతంలో ఉస్మానియా పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారని చెప్పారు. రవీందర్ సార్ వైస్ ఛాన్సలర్ హోదాలో యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీచేసింది. వీనీల నియామకాన్ని ఖరారు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం వర్సిటీల వారీగా జీవోలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయ వీసీగా డీ రవీందర్ తోపాటు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి కే నీతారామారావు, శాతవాహన వర్సిటీ వీసీగా ఎన్ మల్లేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నీ హెచ్ గోపాల్ రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా ఎల్‌బీ లక్ష్మీకాంత్ రాథోడ్, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతిగా డాక్టర్ డీ రవీందర్ గుప్తా, జేఎన్ఏయూ వీసీగా కవిత దర్యాని, కాకతీయకు తాటికొండ రమేశ్, తెలుగు వర్సిటీ వైస్ చాన్స్ గా కిషన్ రావు, జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డిని నియమించింది. వీరంతా మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి