పేద గిరిజన విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడానికి నేనున్నానని భరోసా ఇచ్చిన NRI నన్నపనేని మోహన్
ఖమ్మం, 16 ఆగస్ట్(జనవిజయం): భద్రాచలం నియోజకవర్గం దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామమానికి చెందిన పేద గిరిజన విద్యార్థి.. గడ్డం యువరాజ్ టెన్త్ క్లాస్ లో మరియు ఇంటర్మీడియట్ లో 98 శాతం మార్కులతో పాస్ అయ్యి తన సత్తాను చాటుకున్నాడు. అంతేకాదు.. అల్ ఇండియా JEE ఎంట్రన్స్ లో ర్యాంక్ సాధించి… IITDM KANCHIPURAM తమిళనాడు లో సీట్ సాధించాడు..ఆ కోర్స్ కాల పరిమితి 5 సంవత్సరాలు…విలువైన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతో ఆశ ఉన్నా పేదరికం అడ్డువచ్చింది….ITDA ని కూడా ఆశ్రయించాడు…కానీ సత్వర సహాయం అందకపోవడం వలన నిరాశకు గురయ్యాడు…ఉన్నత విద్య తనకు దూరమైంది అని నిరాశలో ఉన్న తరుణంలో …..గడ్డం యువరాజ్ గురించి తెలుసుకున్న… NRI నన్నపనేని మోహన్…. గడ్డం యువరాజ్ కి ఫోన్ చేసి నేనున్నా నీకు..అని భరోసా ఇచ్చారు.
మొదటి విడతగా డబ్భై ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. అంతే కాదు యువరాజ్ ఉన్నత విద్య పూర్త అయ్యేవరకు ఆర్ధికంగా అండగా ఉంటానన్నారు మోహన్. ఎంతో టాలెంట్ ఉన్న పేద గిరిజన విద్యార్థి ఉన్నత విద్య ఆగిపోకుండా ఆర్ధికంగా అండగా ఉన్న నన్నపనేని మోహన్ ని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు.
మోహన్ గారికి అభినందనలు
మోహన్ గారికి అభినందనలు 👍