జనవిజయంఆంధ్రప్రదేశ్సూపర్ స్టార్ కు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్న బాబు

సూపర్ స్టార్ కు గిఫ్ట్ ఇవ్వలేకపోతున్న బాబు

సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్. తెలుగు సినిమా రంగం ఉన్నంత కాలం ఆయన పేరు గుర్తుండి పోతుంది. ప్రస్తుతం కుమారుడు మహేష్ బాబు విజయాలను ఎంజాయ్ చేస్తూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటశేఖర కృష్ణ . హీరో కృష్ణ  నటుడిగా ఉన్నంత కాలం మే 31 వ తేదీ వస్తుందంటే అభిమానలకు పండగే. సినిమా పత్రికలే కాక పాత ఆంధ్రజ్యోతి వంటి దినపత్రికలు కూడా స్పెషల్ ఫీచర్స్ వేసేవారంటే ఆయనకు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ ని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆయన చిన్న కుమారుడు ప్రస్తుత తెలుగులో సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు ప్రతి ఏటా తన తండ్రి పుట్టిన రోజున తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రకటిస్తూ అలరిస్తుంటారు. ఈసారి కూడా మహేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమాకు సబంధించి ఫస్ట్ లుక్, లేదా మోషన్ టీజర్ లాంటిది ఏదో ఒకటి విడుదల చేస్తారనుకున్నారు. ఈ మేరకు మీడియాలో ముమ్మర ప్రచారం జరిగింది కూడా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుత కోవిడ్ పరిస్తితులలో ఎలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ వద్దని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో అభిమానులు నిరాశతో ఉన్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో తొలిసారిగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ పల్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బ్లడెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర బ్రుందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ ఏడాది ఏ సందడీ ఉండదన్న మాట.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి