జనవిజయంతెలంగాణనిజామాబాద్ లో రెండవ విడత ఇంటింటి సర్వే ప్రారంభం

నిజామాబాద్ లో రెండవ విడత ఇంటింటి సర్వే ప్రారంభం

  • మొదటి విడత సర్వేలో 11వేల కేసుల గుర్తింపు
  • హోం ఐసోలేషన్లో ఉంచి మందుల పంపిణీ
  • కెసిఆర్ ఆదేశాలతో కొనసాగుతున్న రెండో విడత సర్వే

నిజామాబాద్, మే25(జనవిజయం): జిల్లాలో మొదటి విడత ఇంటింటి ఆరోగ్య సర్వేలో సుమారు 11 వేల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి మందులు ఇచ్చి హోం ఐసోలేషన్లో ఉండేవిధంగా చూడడంతో కరోనా వ్యాప్తి తగ్గింది. పీ.హెచ్.సీలలో చేస్తున్న టెస్టులతో పాటు ఇంటింటి సర్వే సత్ఫలితాలు ఇవ్వడంతో సీఎం కేసీఆర్ రెండో విడత సర్వేకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో గడిచిన వారం రోజులలో 3 లక్షల 8వేల 950 ఇళ్లలో రెండో విడత సర్వేను పూర్తిచేశారు. దీంతో పాటు పీ.హెచ్.సీ కి వస్తున్న వారికీ పరీక్షలు చేశారు. వీరిలో ఇప్పటి వరకు జ్వరాలు, స్వల్ప కరోనా లక్షణాలు ఉన్న 7,109 మందిని గుర్తించారు. వీరందరికీ హోం ఐసోలేషన్ కిట్లను అందించారు. వీరంతా లక్షణాలు తగ్గేంత వరకు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలనరేంద్ర సూచించారు.

పంచాయతీల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శికి నమాచారమిచ్చి ఐసోలేషన్లో ఉండే విధంగా చూడాలని సూచిస్తున్నారు. అందులో 95 మందికి లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఆనుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. జిల్లాలో మొదటి విడత ఇంటింటి ఆరోగ్య సర్వే సత్ఫలితాలు ఇవ్వడంతో.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారం రోజుల క్రితం జిల్లాలో రెండో విడత సర్వేను చేపట్టారు. మొదటి విడతలాగానే అంగన్ వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీ ఉద్యోగులతో కలిపి 1,204 టీంలను నియమించారు. వీరి ఆధ్వర్యంలోనే ప్రతీరోజు తమకు కేటాయించిన ప్రాంతాల్లో బృందాలు ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఉన్నవారి వివరాలు తెలుసుకుంటూ జ్వరం వచ్చినవారిని గుర్తిస్తున్నారు. వీరిలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారిని హోం ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. వారికి మందుల కిట్లను అందిస్తున్నారు. ఇళ్లల్లోనే ఉండి మందులు వాడాలని కోరుతున్నారు. జ్వరం తీవ్రత పెరిగినా బయటకు రావొద్దని, కరోనా టెస్టులు అవసరం లేదని వారికి వివరిస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి