జనవిజయంతెలంగాణనియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా - ఈటెల రాజేందర్

నియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా – ఈటెల రాజేందర్

  • రాజీనామా చేయకుండా సిగ్గులేకుండా మంత్రులుగా కొనసాగుతున్న ఇతర పార్టీ నేతలు
  • హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచా… వారి కోరిక మేరకే రాజీనామా చేస్తున్నా….
  • హుజూరాబాద్ లో జరగబోతున్నది కౌరవ పాండవ యుద్ధం….
  • ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకూ కేసీయార్ కుటుంబానికీ జరుగుతున్న యుద్దం

హైదరాబాద్,జూన్12(జనవిజయం): నియంత నుంచి విముక్తి కల్పించడమే నా ఎజెండా అని మాజీ మంత్రి ఈటెల ప్రకటించారు. ఈటెల రాజేందర్ మలిదశ రాజకీయ కార్యాచరణ ఆరంభమైంది. మంత్రిగా బర్త్ రఫ్ అయిన రాజేందర్ తె.రా.స కు గుడ్ బై చెప్పాక వివిధ పరిణామాల అనంతరం భా.జ.పాలో చేరడానికి సిద్ధమైనారు. ఆ మేరకు పార్టీలో చేరడానికి ముందే తన ఎం.ఎల్.ఎ పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం శామీర్ పేటలోని తన ఇంటి నుండి అనుచరులతో కలసి తొలుత గన్ పార్క్ వద్ద అమరుల స్థూపానికి  నివాళులర్పించారు.  ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమలు ఆయన వెంట నడిచారు. తరువాత స్పీకర్ ని కలసి తన శాసన సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెరాస బీ ఫాం ఇచ్చినా తనను గెలిపించింది హుజూరాబాద్ ప్రజలేనని మరోసారి ప్రకటించారు. 17 ఏండ్లు శాసన సభ్యునిగా కొనసాగిన తాను నియోజకవర్గ ప్రజల నిర్ణయం మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ లో రానున్న ఉప ఎన్నికలలో అధికార దుర్వినియోగంతో కుటిల యత్నాలు చేస్తూ ఎలాగైనా గెలవాలని చూస్తోందన్నారు. హుజూరాబాద్ లో కౌరవులకు, పాండవులకు యుద్ధం జరగబోతోందని, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని గుర్తు చేశారు.

సమైక్య పాలకులపై అసెంబ్లీలో గర్జించానని ఈటెల గుర్తుచేసుకున్నారు. నాడు తెలంగాణ రాష్ట్రమే శ్రీరామ రక్ష అని కొట్లాడాం. నేడు ఇతర పార్టీల్లో గెలిచి రాజీనామా చేయకుండా తెరాసలో చేరి నిన్సుగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారు. తెలంగాణలో కరోనాతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.  హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరగబోతోందని వ్యాఖ్యానించారు. వడ్లు తడిచి మొలకలు వచ్చినా పట్టించుకోరు, యువతకు ఉపాధి లేకపోయినా స్పందించరు, కానీ ఈటెల రాజేందర్ ని చక్రబంధంలో పెట్టాలని పోలీసు అధికారులను వాడుతున్నారు. వీటికి రాజేందర్ భయపడడు, నాకు నిర్బంధాలు కొత్త కాదు.. నియంత నుంచి తెలంగాణను విముక్తి కల్పించడమే నా ఎజెండా. అందరూ హుజురాబాద్ ప్రజలకు అండగా ఉండండి. మనిషిగా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటా. హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తా.. సభాపతిని కలిసి రాజీనామా పత్రం అందజేయాలని భావించా… కానీ ఆయన అందుబాటులో లేరు. అనివార్య పరిస్థితుల్లో అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేశా. నా అనుచరులతో పాటు మాజీ ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీలోకి అనుమతించలేదు. నాతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ, అందే బాబు, కేశవరెడ్డి, గండ్ర నళిని భాజపాలో చేరతారు. మరో ఆత్మ గౌరవ పోరాటానికి సన్నద్ధం అవుతాం. మొట్టమెదటిగా హుజూరాబాద్ లో పాదయాత్ర చేస్తా ” అని ఈటల అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి