జనవిజయంఆంధ్రప్రదేశ్నిరుద్యోగ సమస్యలపై తక్షణ కార్యాచరణ కావాలి

నిరుద్యోగ సమస్యలపై తక్షణ కార్యాచరణ కావాలి

రోనా ప్రమాద ఘంటికలు ఇప్పట్లో వదిలేలా లేవు. దేశంలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి ఉంది. ప్రజలందరికి వందశాతం వ్యాక్సిన్ పూర్తి కావాలి. అలాగే కరోనా వైరన్ మ్యుటేషన్లు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే దీని పీడ విరగడ అయ్యేలా లేదు. ఇకపోతే ఆయా రాష్ట్రాలు మెల్లగా లాక్ డౌన్ నడలింపులు ఇస్తున్నాయి. ఈ దశలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. బయట మార్కెట్లో కరోనా ఫ్రీగా అంటుతోంది. అప్రయత్నంగానే అది మనలను, మన కుటుంబాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే వేలాది కుటుంబాలు దీని బారిన పడి ఆప్తులను కోల్పోయాయి. అనేక కుటుంబాల్లో ఇది చిచ్చు పెట్టింది. వేలాది మంది ప్రైవేట్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయాలను అప్పులు చేసి మరీ భరణంగా ఇచ్చుకున్నారు. ఈ విషయాలను గమనించి ప్రజలంతా మరింత అప్రమత్తంగా బయటకు అడుగు పెట్టాల్సిన తరుణమిది. విచ్చలవిడితనం పనికిరాదని గుర్తించాలి. ప్రధానంగా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వ్యక్తిగత అనుబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజు రోజుకూ కరోనా విజృంభణతో కుటుంబ బాంధవ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఎక్కడా ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. వ్యాపార, వాణిజ్యరంగాలు ఇప్పుడిప్పుడే కోలుకునేలా లేవు. ఈ దశలో ఉద్యోగ ఉపాధి రంగాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ప్రణాళిక రచించాలి. భారత్ లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో ఇప్పుడిదే అతిపెద్ద టాస్క్ గా చూడాలి. ప్రభుత్వాలు దూరదృష్టితో ముందుకు సాగాల్సి ఉంది. అమాయకులైన భారత ప్రజలు డబ్బులు తీసుకునో.. తీసుకోలేకనో.. ప్రలోభాలకు లొంగో.. లొంగకుండానో.. తమ ఓట్లేసి గెలిపించినందున పాలకులు అవన్నీ మనసులో పెట్టుకోకుండా.. కార్యాచరణకు దిగాలి.

ఈ క్రమంలో ప్రజలు కూడా మాన్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ముందుకు సాగితే తప్ప ప్రభుత్వ ప్రణాళికలు ఫలితాలు ఇవ్వవు. కరోనా విషయంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించుకుంటూ పోతే ముందుకు సాగలేం. అయితే కరోనా కరోనాయే… రాజకీయం రాజకీయమే అన్నట్టు, అధికారంలో ఉన్న వారు తమ రాజకీయాల్లో బిజీగా మారారు. ఎవరూ మాట్లాడే పరిస్థితి లేదు. అవకాశం లేకపోవడమే కాదు, అంత చొరవ తీసుకోదగిన పరిస్థితి కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఇదే అదనుగా ప్రభుత్వం తను చేయాల్సిన పనులను చేసుకుంటూ పోతోంది. ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేస్తున్నామని చెప్పే పార్టీల ప్రజాసంఘాలు, కార్యకర్తలు పెద్దగా స్పందించడం లేదు. మొన్నటి వరకు చిన్నాచితక మొదలు అన్ని ఎన్నికల పైనే నేతలు దృష్టి సారించారు. వాటిని ఎలా దక్కించు కోవాలన్న రాజకీయాలు నడిపించారు. ఇకపోతే ప్రాణరక్షణ అన్నది ఎవరికి వారు చేసుకోవలసిన విధిగా మారింది. ఎవరికి వారు తమను తాము రక్షించుకోవాల్సిందే. ఇప్పుడు ప్రజలకు దిశానిర్దేశం చేయగలిగే వారు లేరు. అలాగే పోయిన ఉద్యోగాలను ఎలా తెచ్చుకోవాలన్న బెంగతో వేలాదిమంది బతుకీడుస్తున్నారు. అందుకే లాక్ డన్ సడలింపులతో జనం కట్టుబాటులో ఉండడం లేదు. తమ ఉపాధిని వెతుక్కునేందుకు బయట పడుతున్నారు.

ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యక్తిగత వృత్తులు చేసుకునే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. చివరికి మంగలి షాపులు నడుపుకునే వారు సైతం రోడ్డున పడ్డారు. కటింగ్ షాపులకు వెళ్లాలంటే భయపడుతున్న తరుణంలో అలాంటి వారి బతుకులు గడవడం కష్టంగా మారింది. ఇలాంటి వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మదిలో లేవు. దీర్ఘకాలంగా కొనసాగిన ఆర్థిక మాంద్యం కారణంగా అప్పటికే దెబ్బతిన్న రంగాలు మళ్ళీ పుంజుకునే ప్రయాత్నాల్లో ఉండగా కరోనా కాటేసింది. తిరిగి పుంజుకుంటున్నామనే సమయానికి కరోనా ఆంక్షలు, లాక్ డౌన్లు,కర్ఫ్యూలు మొత్తంగా బోర్డు తిప్పేసాలా చేసింది. ఈ దెబ్బతో భారత్ లో ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరోవైపు విదేశాలకు వెళ్లాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. గత కొన్ని నెలల నుంచి కొత్త నియామకాలు పూర్తిగా తగ్గాయి. ఐటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను కుదించుకుని, వర్క్ ఫ్రమ్ హోమ్ తో అదనపు పనిగంటలను రాబట్టుకుంటున్నాయి. గతేడాది మే నెలలో ఉద్యోగుల నియామకాలు 61 శాతం పడిపోయాయని ఆన్ లైన్ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ ఓ సర్వేలో పేర్కొంది. దీంతో వరుసగా రెండు నెలల్లోనూ రిక్రూట్ మెంట్ 60 శాతానికి పైగా పడిపోయిందని తెలిపింది.

సర్వే ప్రకారం ఉద్యోగుల నియామ కాలు ఎక్కువగా హోటల్, రెస్టారెంట్, ట్రావెల్, ఎయిర్ లైన్స్ సెక్టార్లో ఉంటాయి. అయితే ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా దెబ్బతో ఈ రంగాల్లో భారీ కుదుపు పడింది. ఇప్పటికిప్పుడు ఈ రంగాలు పుంజుకునే అవకాశాలు సన్నగిల్లాయి. పుంజుకోవడానికి మరికొంతకాలం పట్టవచ్చు. దీనికితోడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెన్ ఇన్సూరెన్స్ సెక్టార్లలో కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం భారీగా తగ్గింది. మెట్రో సిటీలలో ఉద్యోగుల నియామకాలు భారీగా తగ్గాయి. ఆటోమోబైల్ రంగం పూర్తిగా దెబ్బతినడంతో అనుబంధరంగాల్లో కూడా మాంద్యం ఏర్పడింది. మరోవైపు హాస్పిటాలిటీ, అకౌంటింగ్ సెక్టార్లలో నియామకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు.. కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కలసి దేశంలో నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇలాంటి వారు ఏదైనా సొంతంగా వ్యాపారం చేద్దామనుకున్నా బ్యాంకులు సహకరించేలా కేంద్ర పాలసీలు లేవు. ఎకనామిక్ స్లోడౌన్ దీర్ఘకాలంగా కొనసాగుతుండడంతో నిరుద్యోగ భారతం మన ఆర్థిక చోదకశక్తిని మరింతగా దెబ్బతీయనుంది.

విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు కూడా ఇప్పట్లో లేనట్లే. కార్పొరేట్ రంగాలు పుంజుకుంటే తప్ప ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన సాధ్యం కాకపోవచ్చు. కొత్తగా నియామకాలు లేకపోయినా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు పట్టువదలని విక్రమార్కుల్లా రోడ్డున పడుతూనే ఉన్నారు. ఈ రంగాన్ని ఎలా ఆదుకుంటామన్న ప్రణాళికలు ప్రభుత్వాల ముందు కానరావడం లేదు. పారిశ్రామిక సంస్థల అనుకూల కార్మిక విధానాలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ప్రయోజనకరంగా తోడ్పడుతాయి. నరఫరా అధికంగా ఉంటే వాటి ధర తక్కువగా ఉంటుంది. అదే విధంగా శ్రామికుల లభ్యత అధికంగా ఉన్నప్పుడు శ్రమ ధర తక్కువగా ఉంటుంది. మరి మన దేశంలో జనాభా అత్యధికంగా ఉన్నది కనుక కార్మికుల సరఫరా కూడా అపరిమితంగా ఉన్నది. కార్మికుల సరఫరా అత్యధికంగా ఉన్నది కనుక వారి మార్కెట్ వేతనాలు అనివార్యంగా తక్కువగా ఉన్నాయి. ఈ దశలో పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడంతో పాటు కార్మికులను అధికంగా రిక్రూట్ చేసుకునేలా ప్రభుత్వం ముందుకు వస్తే కొంతయినా ఉపశమనం కలుగుతుంది. అలాగే అనేక కంపెనీలతో మాట్లాడి రిక్రూట్ మెంట్లను ప్రోత్సహించాలి. అలా కొంతయినా ఉపాధి అవకాశాలను పెంచుకోగలం. ఈ మేరకు ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్యాచరణకు దిగాలి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి