జనవిజయంఆంధ్రప్రదేశ్నిను మరవదు ఈ గడ్డా..... మా మన్నెపు దొర బిడ్డా..... (హీరో కృష్ణ పుట్టినరోజు కానుక)

నిను మరవదు ఈ గడ్డా….. మా మన్నెపు దొర బిడ్డా….. (హీరో కృష్ణ పుట్టినరోజు కానుక)

మే 31 సూపర్ స్టార్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆయన అభిమానులకు పండుగ రోజు. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా మహేష్ బాబు వైపు నుండి ఎటువంటి గిఫ్ట్ రావడం లేదని ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. మొదట సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ఏదో ఒక గిఫ్ట్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతుందని భావిస్తూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వస్తున్న సందర్భంగా ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితులలో అలాంటివేమీ చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వయంగా హీరో కృష్ణ కూడా తన పుట్టినరోజు వేడుకలకు అభిమానులను రావద్దని కబురు చేశారు. నిరాడంబరంగా తన చిన్న కూతురు ఇంటివద్ద తన 78వ బర్త్ డే ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. అయితే కృష్ణగారి  అభిమానులను సంత్రుప్తి పరస్తూ అనూహ్యంగా ఊర్వశి ఓ.టి.టి వారు నటశేఖర కృష్ణ కు పుట్టిన రోజు కానుకగా ఓ పాటను విడుదల చేశారు. దర్శకుడు వీరు.కె సారధ్యంలో రూపకల్పన గావించిన ఈ పాటను ఆర్‌.పి పట్నాయక్, మౌనిక పాడారు. లిరిక్స్, పాట అద్భుతంగా వచ్చాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన కృష్ణగారిపై ఓ పాటను ఆయన బర్త్‌డే కానుకగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ, విడుదల చేయడం గర్వంగా ఉందని ఓ.టి.టి ఎం.డీ కనగాల రవి తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన మా అధ్యక్షుడు నరేష్ కు ధన్యవాదాలు తెలిపారు. అల్లూరి సీతరామరాజు అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది హీరో కృష్ణనే. అంతగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోవడం, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఆ పాత్రను ఆధారం చేసుకుని సీతారమారాజుపై లిరిక్స్ తో కృష్ణగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తయారు చేసిన ఈ వీడియో కూడా అద్భుతంగా రూపుదిద్దుకోవడం విశేషం. కృష్ణగారి అభిమానులకోసం జనవిజయం లో ఆ వీడియోను దిగువన ఉంచుతున్నాము.

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి