జనవిజయంఆంధ్రప్రదేశ్ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహనిర్బంధం

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గృహనిర్బంధం

సైకిల్ పై వార్డుల్లో పర్యటించకుండా కట్టడి

ఏలూరు,మే24(ఆర్ఎస్ఎ): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పై వార్డు, గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకునేందుకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచి నిమ్మల రామానాయుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. సోమవారం నిమ్మల ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రమం ఆనుషత్రిలను సందర్శించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణ సిబ నీహెచ్ ఆంజనేయులు సారథ్యంలో ఎ రెహమాన్, పాలవలన వెంక`ట అప్పారావు, పోలీసు సిబ్బంది ఆయన గృహాన్ని చుట్టుముట్టారు. ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏలూరు పర్యటనకు వెళ్లిన తనను హౌస్ అరెస్టు చేయడంపై పోలీసులపై రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వచ్చిన ఆదేశాల ప్రకారం బయటకు అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు. ఇదిలావుంటే పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు సైకిల్ పై వెళ్లి కొవిడ్ బాధితులను పరామర్శిస్తున్నాచారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల వలం టీర్లు, ఏఎన్ఎంలను కొవిడ్ బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు నిత్యావసరాలు, పౌష్టికాహారం ఎమ్మెల్యే అంద జేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో రూ. 500 కోట్లు కొవిడకు కేటాయించడం చూస్తుంటే ప్రజల ప్రాణాలపై జగన్ కు ఏ మాత్రం దయలేదని అర్థమవుతోందన్నారు. మన రాష్ట్రం వ్యాక్సిన్ ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. ప్రపంచం అంతా వ్యాక్సిన్ కోసం పోటీ పడుతుంటే సీఎం మాత్రం ప్రతిపక్షాన్ని అణచి వేయడానికి పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ కావాలి, బెడ్స్ కావాలి, ఆక్సిజన్ అందజేయాలని, పేదవారికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించాలని సైకిలు ఫ్లెక్సీ కట్టుకుని ఎమ్మెల్యే వార్డుల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఆయనను గృహనిర్బంధం చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి