Thursday, October 5, 2023
Homeవార్తలుఅంగన్వాడీ సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

అంగన్వాడీ సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

ఖమ్మం, ఆగష్టు 19 (జనవిజయం): క్షేత్రస్థాయిలో అంగనవాడి సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా సంక్షేమ అధికారి సుమ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్‌ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సిడిపివోలు, ఏసిడిపివోలతో మహిళా శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమంపై శాఖ పరంగా అందిస్తున్న సేవలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ అంగనవాడి కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులను సరైన సమయంలో సరైన విధంగా పర్యవేక్షించాలని ప్రతిరోజు ఉదయం 9 గంటలకు అంగనవాడి టీచర్‌ మరియు హెల్పర్ల యొక్క హాజరు 10 గంటలకు పిల్లల యొక్క హాజరు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆరోగ్య లక్ష్మి పథకం కింద పౌష్టికాహారం తీసుకునేందుకు వచ్చే గర్భిణీ బాలింతల హాజరును విధిగా పోషణ ట్రాకర్‌ మరియు న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రతినెల 8వ తేదీ లోపు పిల్లల ఎత్తు బరువులు త్రూచి సరైన పద్ధతిలో పోర్టల్‌ లో నమోదు చేయాలని నమోదు చేసే క్రమంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వెంటనే పై అధికారులకు సూచించాలని లేనిపక్షంలో వారు పోషణ లోపంతో బాధపడుతున్న వారిగా గుర్తించబడతారని దీనిపై అంగనవాడి టీచర్లకు ఆ సెక్టార్‌ యొక్క సూపర్వైజర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషిచేసి పోషణ లోప రహిత జిల్లాగా ఖమ్మం జిల్లా ని మార్చాలని తెలిపారు. అతి తీవ్ర పోషణ లోపం, తీవ్ర పోషణ లోపం, పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారులను సప్లిమెంటరీ సూపర్వైజర్‌ ఫీడిరగ్‌ ప్రోగ్రాంలో చేర్చి సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ గారి ఆదేశాలు తూచా తప్పకుండా ప్రతి శుక్రవారం స్థానిక ఆసుపత్రులకు అంగన్వాడీ కేంద్రాలలో నమోదు అయిన చిన్నారులు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి సాధారణ స్థితికి తీసుకొని రావాలని అంగనవాడి కేంద్ర పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకొని చేతి శుభ్రత పై లబ్ధిదారులకు అవగాహన పెంచాలని తెలిపారు. సొంత అంగనవాడి కేంద్రాలలో తప్పనిసరిగా పెరటి తోట పెంపకం మరియు న్యూట్రి గార్డెన్‌ ఏర్పాటు చేసి ఆ గ్రామ ప్రజలకు పౌష్టికార విలువలు తెలియజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి వీల్‌ చైర్స్‌ అందజేయడం జరిగిందని వాటి యొక్క ప్రస్తుత పరిస్థితి నివేదిక స్థానిక పంచాయతీ సెక్రెటరీ ద్వారా తీసుకొని జిల్లా కార్యాలయం పంపాలని, 23 సంవత్సరాలు లోపు గల పూర్తిస్థాయి అనాధ పిల్లల వివరాలను త్వరగా పంచాయతీ సెక్రెటరీ, అంగనవాడి టీచర్‌ ఆమోదంతో సిడిపిఓలు ఆధ్వర్యంలో ఆథరైజ్డ్‌ కాపీలు అందజేయాలని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న సూపర్వైజర్లందరూ ప్రతినిత్యం అంగన్వాడి కేంద్రాలను పర్యవేక్షించాలని హెల్పర్ల నుండి టీచర్లుగా ప్రమోషన్లు వచ్చిన వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తోడ్పడాలని తెలిపారు. ఈ సమావేశంలో సిడిపివోలు కృష్ణకుమారి, శారద శాంతి, దయామని, కొండమ్మ, కవిత, కమల ప్రియ, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments