కొత్తగూడెం, ఆగస్ట్ 08 (జనవిజయం): పోలీస్ శాఖ లో నిజాయితీ, నిబడ్డత తో పనిచేస్తే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఎస్పీ డాక్టర్ వినీత్.జి అన్నారు. పదోన్నతులు బాధ్యతలను మరింతగా పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి పొందిన తొమ్మిది మంది కానిస్టేబుళ్లను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డా.వినీత్.జి అభినందించారు. ఓఎస్డి కార్యాలయంలో పనిచేస్తున్న రవి, రామ కోటేశ్వరరావు, రామనాధం, రాంబాబు, సురేష్, ఇంద్రలాల్, వాంకుడోతు రవి, యేసు, రాజేష్ ఖన్నా లకు పదోన్నతులు కల్పిస్తూ ఇటీవల ఐజీ/డిఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతులు బాధ్యతలను మరింతగా పెంచుతాయని, పోలీస్ శాఖలో నిబద్ధతతో నిజాయితీతో పని చేసే వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్ మరియు తదితరులు పాల్గొన్నారు.