సత్తుపల్లి, ఆగస్ట్15 (జనవిజయం): మండల పరిధిలోని రేజర్ల గ్రామంలో న్యూ సాంగ్ హైస్కూల్ నందు మంగళవారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుక ప్రిన్సిపాల్ నంబూరి సిల్వియా జయదీప్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్ పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం డాక్టర్ నంబూరి ముఖర్జీ విక్టర్, నంబూరి జయదీప్ ముఖర్జీ స్కూల్ టీచర్స్, పిల్లి జగన్ మోహనరావు లు పాల్గొన్నారు.