జనవిజయంతెలంగాణతెలంగాణలో నేటి నుండి షర్మిల పర్యటనలు

తెలంగాణలో నేటి నుండి షర్మిల పర్యటనలు

  • కరోనా తగ్గుముఖంతో షర్మిల అలర్ట్
  • జిల్లాల పర్యటనలతో మరోమారు ప్రజల్లోకి
  • నేడు మెదక్ జిల్లా పర్యటనతో తిరిగి రంగంలోకి

హైదరాబాద్, జూన్ 1(జనవిజయం): కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో వై.ఎస్.షర్మిల తిరిగి జిల్లాల పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇటీవలే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ ఏర్పాటు అవశ్యకతను తేల్చి చెప్పిన వైఎస్ షర్మిల అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆమె యత్నాలకు కొంత బ్రేక్ పడింది. ఆమె సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాజకీయ నిర్ణయాలపై విరుచుకుపడుతోంది. యువతకు ఉద్యోగాలంటూ షర్మిల దీక్షలు సైతం చేపట్టడం, పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయడంతో ఇంటి వద్ద దీక్షను చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కే.సి.ఆర్ పైనా, ప్రభుత్వంపైనా విరుచుకుపడ్డారు. ఆమె అనుచరులు సైతం జిల్లాల్లో దీక్షలు చేపట్టారు. కరోనా ఉదృతితో ఈ దీక్షలకు బ్రేక్ పడింది. ట్విట్టర్ వేదికగా కరోనా కట్టడిలో సీఎం కేసిఆర్ విఫలమయ్యారని షర్మిల ఆరోపించారు. అవకాశం వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించడంతో పాటు, పాజిటివ్ కేసులు తగ్గుతుండడంతో ఆమె మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ రెండు నుండి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించబోతున్నారు. జూన్ 2 హైదరబాద్ లోని గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళు లు అర్పించిన అనంతరం సీఎం కేసిఆర్ స్వంత జిల్లా మెదక్ జిల్లాలో ఆమె పర్యటన చేయబోతున్నారు. నిరుద్యోగ దీక్షలో కూడ నీఎం నియోజకవర్గమైన గజ్వేల్ లో ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలచే ఆమె నిమ్మరసం స్వీకరించి దీక్షను విరమించారు. ఇప్పుడు కూడ నీఎం జిల్లా మెదక్ నే ఎంచుకున్నారు. ప్రతిరోజూ వివిధ ప్రాంతాలలో పర్యటనలు చేస్తూ ఖమ్మంలో బహిరంగ సభలో ప్రకటించినట్టుగా దివంగత సీఎం వైఎస్ఆర్ పుట్టిన తేదీ జూలై 8న పార్టీ ఏర్పాటు చేయాలని షర్మిల అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 8న పార్టీని ఆవిష్కరించనున్నారు. పార్టీ ప్రకటన గ్రాండ్ గా చేసేందుకుగాను జిల్లాల పర్యటనల ద్వారా వైఎస్ షర్మిల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి