జనవిజయంఅంతర్జాతీయంనేపాల్‌లో రాజ్యాంగ సంక్షోభం

నేపాల్‌లో రాజ్యాంగ సంక్షోభం

  • పార్లమెంట్‌ రద్దు..నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు
  • ఆదేశాలు ఇచ్చిన అధ్యక్షురాలు భండారీదేవి

ఖాట్మాండు,మే22(జనవిజయం): నేపాల్‌ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్‌ 12,19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు షేక్‌ బహదూర్‌ దేవ్‌బా, కేపీ శర్మ ఓలి చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు. ఈ మేరకు నేపాల్‌ అధ్యక్షురాలి కార్యాలయం శుక్రవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేశారని, మొదటి సాధారణ ఎన్నికలు నవంబర్‌ 12న, రెండో దశ ఎన్నికలు 19న నిర్వహించాలని ఆదేశించినట్లు కార్యాయం ప్రకటనలో పేర్కొంది. ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేపీ శర్మ ఓలీ బలనిరూపణకు వెనక్కి తగ్గగా, రాష్ట్రపతి విద్యాదేవి భండారీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ఇతర రాజకీయ పార్టీలను కోరారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 5 గంట వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో తమకు 149 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విపక్ష కూటమి ముందుకు వచ్చింది. అయితే, విపక్ష అభ్యర్థనలను అధ్యక్షురాలు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్‌ కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్నది. రోజుకు సగటున 8వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి