జనవిజయంవినోదంఆత్రేయ మనసు పడ్డ పాట.. నేనొక ప్రేమ పిపాసిని..

ఆత్రేయ మనసు పడ్డ పాట.. నేనొక ప్రేమ పిపాసిని..

 

సినిమా పేరు: ఇంధ్రధనుస్సు(1978), నేపధ్య గానం: బాలు,  సంగీతం: కె.వి.మహదేవన్, రచన: ఆచార్య ఆత్రేయ, దర్శకత్వం: కె.బాపయ్య, నటీనటులు: హీరో కృష్ణ, శారద, నిర్మాతలు: నన్నపనేని సుధాకర్, టి.సుబ్బారాయుడు. కాగా ఈ పాటంటే ఆచార్య ఆత్రేయకు ఎంతో ఇష్టమని…. తనను అడిగి మరీ ఎన్నోసార్లు పాడించుకునేవాడని గాయకుడు బాలు పలు సందర్భాలలో చెప్పేవారు. సూపర్ స్టార్ కృష్ణ హిట్ సాంగ్స్ లలో ఇదొకటి. మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ చానల్ వారి నుండి ఎంబెడెడ్ కోడ్ ఉపయోగించడం ద్వారా జనవిజయం వీక్షకుల కోసం ఇక్కడ ఉంచుతున్నాము.

——————–

పల్లవి:
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని….
చరణం 1:
తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
తలుపు మూసిన తలవాకిటిలో పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా
నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
నేనొక ప్రేమ పిపాసిని…
చరణం 2:
పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను
ప్రేమ భిక్షనూ పెట్టగలవని దోసిలి ఒగ్గాను
నీ అడుగులకు మడుగులోత్తగా ఎడదను పరిచాను
నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని…
చరణం 3:
పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
సెగ రేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలునని
నీ జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
నను వలచావని తెలిపేలోగా నివురైపోతాను

జనవిజయంలోని అన్ని తెలుగు హిట్ సాంగ్స్ కోసం ఇక్కడ నొక్కండి.

మీకు తెలిసిన తెలుగు హిట్ సాంగ్స్ కోసం మాకు వ్రాయండి : [email protected]

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి