ఖమ్మం,ఆగష్టు 18 (జనవిజయం): నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో డివైఓ అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు, అకౌంటెంట్ భానుచందర్ గారి ప్రోత్సాహంతో, పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షారుక్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సద్భావనా దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలసివేసి వారి గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించి ఆయన లాగా అందరూ భారతరత్న లాగా ఎదగాలని విద్యార్థులకు తెలియజేసి సద్భావనా దివాస్ ప్రతిజ్ఞ చేసి ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుష్మ స్వరాజ్ అనే విద్యార్థిని పాడిన దేశభక్తి గేయాన్ని మెచ్చుకొని నెహ్రూ యువ కేంద్ర అకౌంట్స్ మరియు పోగ్రామ్ అధికారి శ్రీ కమ్మర్తపు భానుచందర్ మెచ్చుకొని నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల బృందం ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ శ్రీ రామ కుమారస్వామి మరియు శ్రీమతి మర్జియానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యజమానియానికి పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు