జనవిజయంతెలంగాణనేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

  • జెండా ఆవిష్కరించనున్న సిఎం కెసిఆర్
  • కోవిడ్ నేపధ్యంలో నిరాడంబరంగా ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 1(జనవిజయం): జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లో జెండా ఆవిష్కరిస్తారు. కరోనాతో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి ఏడేళ్లయిన సందర్భంగా ధూమ్ ధామ్ గా సంబరాలకు సర్కార్ సన్నాహాలు చేయాలనుకున్నా కరోనా దెబ్బకొట్టింది. దీంతో నిబంధనల మేరకే ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసాయి. సిఎం కెసిఆర్ పతాకావిష్కరణ చేసి సందేశం ఇస్తారు. పోలీన్ గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఉత్సవాల సందర్భంగా అవార్డులు ప్రదానం చేసే అవకావం ఉంది. ఉత్సవాల సందర్భంగా జూన్ 2న అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. రక్తదానం, పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడతున్నారు.

అలాగే 33 జిల్లాల కేంద్రాల్లో మంత్రులు, అధికారులు జెండావందనం చేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తారన్నారు. రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరిగిందని తెలిపారు. సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ వేడుకలకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆంక్షలు అమలు చేస్తున్నామన్నారు. గన్ పార్క్ వద్ద ఏర్పాట్లను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. గన్ పార్క్ లో అమరులకు ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యి నివాళి అర్పిస్తారు. తొలుత సిఎం అక్కడ అమరవీరులకు నివాళి అర్పించి పబ్లిక్ గార్డెన్ చేరుకుంటారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి