జనవిజయంఆంధ్రప్రదేశ్దోపిడీ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సుందరయ్య

దోపిడీ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సుందరయ్య

  • దోపిడీ,దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
  • నేడు సుందరయ్య వర్ధంతి సందర్భంగా

విజయవాడ,మే19(జనవిజయం): దోపిడి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన యోధుడు పుచ్చపల్లి సుందరయ్య. ఆయన పోరాటస్ఫూర్తి కొరవడడంతో ఇప్పుడు కార్మిక, శ్రామిక వర్గాల్లో నైరాశ్యం నెలకొంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన పోరాటాలను స్మరించుకుంటే ..ఆయన ఎంతటి నిజాయితీ కలిగిన పోరాట యోధుడో అర్థం చేసుకోవచ్చు. ఈ దోపిడీ వ్యవస్ధను అంతం చేసి, దోపిడి, పీడన లేని సమ సమాజాన్ని స్థాపిస్తుందని నమ్మి తన జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశాడు. అంతేకాదు తన యావదాస్తిని కూడా అప్పగించి సాదాసీదా మనిషిగా జీవితాంతం నిలిచారు. ప్రజలను చైతన్యం చేసే క్రమంలో ఆచారాలు, సంప్రదాయాలు, మూఢ నమ్మకాలను రాజీ లేకుండా ప్రతిఘటించాడు. పీడిత ప్రజలను చైతన్య పర్చేందుకు కృషి చేశాడు. ప్రజలు ఈతి బాధల్లో వున్నప్పుడు, ప్రకృతి విపత్తు, కరువు కాటకాలకు కష్టనష్టాల పాలయినప్పుడు ఉద్యమాన్ని సవిూకరించి అండగా నిలిచాడు. హైదరాబాదు సంస్ధానంలో ఫ్యూడల్‌ నిరంకుశ నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1946-51 వరకు వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఒక మహత్తర ప్రజా పోరాటంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అటువంటి పోరాటానికి సారథ్యం వహించిన వారిలో సుందరయ్య ముందున్నారు. ఆంధ్రా ప్రాంతంలో విస్తృతంగా జరిగిన జవిూందారీ వ్యతిరేక పోరాటాలలో ఆయన ముందు నడిచారు. కొన్నింటిలో ప్రత్యక్షంగా మరికొన్నింటికి పరోక్షంగా మార్గదర్శకత్వం వహించాడు. ఈ పోరాట పటిమ, ఉద్యమ అనుభవమే ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న అతిరథ మహారథులైన అనేక మంది నాయకులలో సుందరయ్యని అగ్రగణ్యులుగా చేసింది. సుందరయ్య సంఘ సంస్కరణను విప్లవోద్యమంలో అంతర్భాగంగానే చూశాడు. విప్లవోద్యమాన్ని కుంటుపర్చడానికి ప్రజలలో తాత్కాలిక భ్రమలను సృష్టించడానికి జరిగే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేవారు. పోరాటాలు చేస్తున్న ప్రజలే సంస్కరణలను ముందుకు తెస్తారని భావించేవారు. అయితే సామాజిక అసమానతలను అధిగమించి పీడిత వర్గాల సంపూర్ణమైన ఐక్యతను సాధించకుండా పాలకులు చేసే కుట్రలను ఎప్పటికప్పుడు సుందరయ్య ఎత్తిచూపేవారు. ఇకపోతే ప్రజా సేవా కార్యకలాపాల ద్వారా అసమానతలను రూపుమాపాలని భావించేవారు. గ్రామాల్లో అంగడి పెట్టి వివక్షకు, మోసానికి తావు లేకుండా పేదలకు సరుకులు అందించడం, ఆధునిక వైద్య పద్ధతులలో శిక్షణ పొంది పురుళ్లు పోయడం, వేలాదిమంది రైతులను కదిలించి బందరు కాల్వ పూడికను తియ్యడం, ధరలు ఆకాశానికంటుతున్న తరుణంలో రైతుల నుంచి ధాన్యం గిట్టుబాటు ధరలకు సేకరించి కేజి బియ్యాన్ని రూపాయికి పేదలకు అమ్మించడం, కరువులో ఆకలి మంటలకు గురయిన పేదలకు గంజి కేంద్రాలను నిర్వహించడం వంటివి చేసేవారు. రాయలసీమకు దాపురించిన కరువులో ప్రజలను ఆదుకోవడం, బెంగాల్‌ కరువు బారిన పడిన ప్రజలకు వైద్య, వస్తు సహాయాన్ని పంపించడం, దివి తాలూకా ఉప్పెనలో సర్వం కోల్పోయిన ప్రజలకు సహాయ కార్యక్రమాలను ప్రారంభించడం….ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ఆయన ప్రత్యక్ష, పరోక్ష పాత్ర వుంది. ప్రజా ఉద్యమాలకు సంబంధం లేకుండా సేవాకార్యక్రమమే పరమార్ధంగా ఇలా ప్రజలను ఏకం చేయవచ్చని ఆయన భావించేవారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి