జనవిజయంతెలంగాణనేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటెల?

నేడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటెల?

  • హైదరాబాద్ చేరుకున్న ఈటెల రాజేందర్
  • ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు 

హైదరాబాద్,జూన్ 3 (జనవిజయం): మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైద్రాబాద్ చేరుకున్నారు. వీరివురికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నాలుగు రోజులపాటు ఈటల ఢిల్లీలోనే గడిపారు. అక్కడ బీజేపీ ముఖ్య నేతలను కలిసి తనకు జరిగిన అన్యాయం, పార్టీలో చేరికపై చర్చరించారు. కాగా.. ఈ నెల 4న ఈటల మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన వివరాలు, బీజేపీలో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎన్ గూటిని వదిలి బిజెపి తీర్థాన్ని పుచ్చుకోనున్నారని ఇప్పటికే స్పస్టమయ్యింది. బిజెపి నేతలు కూడా దీనిని ధృవీకరించారు. ఈ నెల 4న ఈటల రాజేందర్ టిఆర్ఎస్ కు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మంచిరోజు చూసుకుని ఢిల్లీకి వచ్చి బిజెపిలో చేరతానని ఈటల రాజేందర్ అన్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడానికి ఈటల రాజేందర్ ఈ నెల 4న విలేకరులతో సమావేశం కానున్నారు. ఆయనతో సహా మొత్తం అయిదుగురు నేతలు బిజెపిలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. వీరిలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ కూడా ఉన్నారు. గత సోమవారం జెపి నడ్డాను, మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ ఛగ్ ని, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని ఈటల రాజేందర్ కలిశారు. బుధవారం మరోసారి జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డిలు ఛగ్, మాజీ ఎంపి జి.వివేక్ తో కలిసి ఆ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్.నంతోష్ తో సాయంత్రం ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే ఈటల రాజేందర్ తాను బిజెపిలో చేరతానని వెల్లడించినట్లు సమాచారం. సంతోష్ మాట్లాడుతూ… రానున్న రోజుల్లో తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజేందర్, రవీందర్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. హుజూరాబాద్ లోని తన అనుచరులు, అభిమానులతో మాట్లాడిన అనంతరం ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శుక్రవారం హుజూరాబాద్ వెళ్లి అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న వేళ.. సీనియర్ నేత పెద్దిరెడ్డి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో పార్టీలో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో పడింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఈటల చేరికకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్దిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. పెద్దిరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన బండి సంజయ్.. పెద్దిరెడ్డి అనుమానాలపై క్లారిటీ ఇచ్చారని.. ఈటల చేరిక పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి కాబోదని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి.. ఈటల చేరికపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. అంతా కలిసి పార్టీ కోసం పని చేయాలని డీకే అరుణ సూచించినట్లు సమాచారం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి