- సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు
ఖమ్మం, ఆగష్టు 1 (జనవిజయం): మున్నేరు వరదలకు గురైన ముంపు బాధితులకు వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో 29, 30, 34 డివిజన్ ప్రాంతాలలో ప్రకాష్ నగర్ , ఎఫ్ సి ఐ గౌడ ను, ఎస్సీ కాలనీ, సుందరయ్య నగర్, పంపింగ్వేల్ రోడ్డు, పెద్దమ్మ తల్లి గుడి రోడ్డు ముంపునకు గురైన కుటుంబాలను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు మాట్లాడుతూ రెండు మూడు రోజుల కింద వచ్చిన వర్షాలకు ఈ ప్రాంతాలన్నిటిలో ఇండల్లోకి నీరు చేరి సామాన్లు బియ్యం ఇతర సామాగ్రి అన్ని నీళ్లల్లో మునిగి ఖరాబు అయినాయి. అంతేకాకుండా ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రహరీ గోడలు కూడా కూలిపోయినాయి. కొందరి ఇళ్లల్లో బట్టలు కూడా ఆగం అయిపోయినాయి. వర్షాలకు వచ్చిన వరద ముంపు దాని కారణంగా వరద లో వచ్చినటువంటి చెత్తాచెదారం, బురద మొత్తం ఎక్కడికక్కడే రోడ్ల వెంబడి ఇంటి ముందల అంతే ఉన్నాయి మున్సిపల్ అధికారులు గానీ మెడికల్ అధికారులు గానీ డివిజన్లో పర్యటించలేదు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మెడికల్ అధికారులు పర్యటించి సర్వే చేసి వారికి నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.
అంతేకాకుండా సైడు కాలువలలో బ్లీచింగ్ బురద వచ్చిన కాడ ఇండ్లలో కూడా బ్లీచింగ్ వేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని వరద వచ్చిన ముంపు ప్రాంతాలలో దోమలు కూడా విపరీతంగా పెరిగాయి దోమల నివారణ కొరకు దోమల పొగ మిషన్ కూడా తిప్పాలని సీపీఎం నేతలు అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు షేక్ సైదులు, షేక్ హిమాం, సారంగి పాపారావు, పున్నయ్య చౌదరి, హెచ్ పేరయ్య, నల్ల మాస వీరస్వామి, కుర్రి రవి, మాగి లక్ష్మయ్య, నూకల నాగేశ్వరరావు, హెచ్ బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.