Tuesday, October 3, 2023
Homeవార్తలువర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలకు, ఇండ్లకు నష్ట పరిహారం యివ్వాలి - నున్నా నాగేశ్వరరావు

వర్షాలు, వరదలకు దెబ్బతిన్న పంటలకు, ఇండ్లకు నష్ట పరిహారం యివ్వాలి – నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం, జూలై 30 (జనవిజయం) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి తదితర పంటలకు, వరద ముంపుకు గురై దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం యిచ్చి ప్రజల్ని ఆదుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాడు జరిగిన సిపిఎం ఖమ్మం జిల్లా కమిటి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటి, మండల కమిటి సభ్యులు, శాఖా కార్యదర్శులు, ప్రజా రంగాల జిల్లా బాధ్యులు 400 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సీజన్‌ ప్రారంభంలో వర్షాభావం వలన వేసిన విత్తనాలు మొలవక 2, 3 సార్లు రైతులు విత్తనాలు వేయాల్సి వచ్చిందన్నారు. 3వ సారి వేసిన విత్తనాలు అతివృష్టి, వరదల వలన దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వరదల వలన నదీ ప్రవాహ ప్రాంతాల్లో పంట భూములు కోతకు గురై, కొన్నిచోట్ల మేటలు వేసి భూములు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో మున్నేరు ముంపు వలన ప్రాణ నష్టం జరగకపోయినా, వందల సంఖ్యలో ఇండ్లు నీట మునిగి మధ్య తరగతి పేదలు అపారంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మునిగిన ఇండ్లకు 50 వేలు, దెబ్బతిన్న ఇండ్లకు లక్ష రూపాయలు, ఆహార ధాన్యాల పంటలకు ఎకరాకు 10 వేలు, వాణిజ్య పంటలకు 20 వేలు, మేట వేసిన, కోతకు గురైన భూములకు ఎకరాకు 50 వేలు యివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిహారం కోసం ఆందోళనలు నిర్వహించాలన్నారు.
రైతు సమస్యలపై పోరాటం:  లక్ష రూపాయల రుణమాఫీ, కౌలు రైతులకు కూడా రైతుబంధు డబ్బుల కోసం, ధరణి సమస్యలు పరిష్కరించాలని, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం కొత్త రుణాలు యివ్వాలని ఆగస్టు 11`20 తేదీలలో ప్రచారం ఆందోళనలు జరపాలని పిలుపునిచ్చారు.
స్వంత స్థలం ఉన్న పేదలకు గృహలక్ష్మి పథకం క్రింద 5 లక్షల రూపాయలు యివ్వాలని, ఇళ్ళులేని పేద వారికి స్థలాలు యివ్వాలని, రేషన్‌ కార్డులు, 57 సం.లు నిండిన వారికి ఆసరా పెన్షన్‌లు యివ్వాలని, దళితబంధు, బిసి, మైనార్టీలకు లక్ష పథకాన్ని అర్హులందరికి యివ్వాలని ఆగస్టు 17, 18 తేదీలలో పేదలను సమీకరించి తహశీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలన్నారు.   పోడు పట్టాలు అందని అర్హులైన గిరిజన, గిరిజనేతర ప్రజలకు హక్కు పత్రాలు, రైతుబంధు కోసం కూడా పోడు ప్రాంతాలలో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, బండి రమేష్‌, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై. విక్రమ్‌, బొంతు రాంబాబు, చింతలచెర్వు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments