యుద్ధం ముగిసిపోలేదు
యుద్ధం ముగిసిపోలేదు
యుద్ధం అలసిపోలేదు
గుండెలో పద్మవ్యూహమై
తూటాకు పాట నేర్పుతూ
యుద్ధనౌక సాగిపోతుంది
యుద్ధం పాటై ప్రవహిస్తుంది
యుద్ధం మాటై పలుకుతుంది
యుద్ధం ఆటపాటలై
విరామం లేని పోరాటం చేస్తుంది
యుద్ధం కోకిల గానం చేస్తూ
కొండ కోనల్లో వాగు వంకల్లో
నదీ నదాలపై అలలై ప్రవహిస్తుంది
యుద్ధం నెమలితోనాట్యం చేస్తూ
అడవి బిడ్డలను
ఒడిలో చేర్చుకుంటుంది
యుద్ధం హావ భావాలతో
అరుణ పతాకమై
గగనాన రెపరెపలాడుతూ
దోపిడీని పాతాళానికి తొక్కుతుంది
యుద్ధభూమిలో యుద్ధం
నియంతృత్వంపై ఉరుములా గర్జిస్తూ
మెరుపులా యుద్ధనౌక సాగిపోతుంది
యుద్ధం అలసిపోలేదు
యుద్ధం ముగిసిపోలేదు
యుద్ధం రాకాసి రాజ్యంపై
రాజీలేని పోరాటం చేస్తుంది
యుద్ధంలోని రక్తపుటేరులను
భుజాలపైనుండి
గొంగలి మోసుకుపోతుంది
యుద్ధం గద్దరై గర్జిస్తుంది
యుద్ధం గద్దరై గాండ్రిస్తుంది
యుద్ధం గద్దరై
కదనరంగాన కదం తొక్కుతుంది
యుద్ధం అలసిపోలేదు
యుద్ధం ముగిసిపోలేదు
యుద్ధం గద్దరై గానం చేస్తుంది
యుద్ధం గద్దరై గజ్జ కట్టింది
యుద్ధం గద్దరై నాట్యం చేస్తుంది
యుద్ధభూమిలో యుద్ధం
విరామ మెరుగని విప్లవ వీరుడు
గద్దర్ కు లాల్ సలాం చేస్తూ
ప్రజా యుద్ధనౌకై సాగిపోతూనే ఉంది
(విప్లవ యోధుడు గద్దరన్నకు విప్లవ జోహార్లు)
—- కట్టెకోల చిన నరసయ్య
9951260316
సూపర్ నర్సన్న గారు 🙏