జనవిజయంసాహిత్యంనమోస్తు భారతావని

నమోస్తు భారతావని

ఖండ భారతావని మురిసిపోతోంది
మన నిబద్ధత, నిజాయితీ చూసి

జాతీయ పతాకం రెపరెపలాడుతోంది
మన నిశ్చలత,నిర్వికారతను చూసి

ఎప్పుడో స్వాతంత్య పోరాటంలో చూసాం
వందేమాతర నినాదం తో దేశం ఏక తాటిపైకి రావటం
ఇప్పుడు స్వీయ నిర్భంధం తో చూస్తున్నాం
అంతస్సూత్రం ఒకటే స్వేచ్ఛ

అప్పుడు శత్రువు కంటి ముందు ఉన్నాడు
బ్రిటీషు వాడి రూపంలో

ఇప్పుడు కాలు కదపనివ్వని,చేయి చాపనివ్వని
ఈ మహమ్మారి ఎంత టక్కరి
కంటికి కనిపించకుండా కట్టేసింది కరోనా రూపంలో

ఐనా భారతీయుని ఆత్మశక్తి ముందు
ఏ మాయా పని చేయదు

విశ్వం ప్రశ్నించినప్పుడల్లా ఈ భూమి
సమాధానమై నిలిచింది
కావాలంటే చరిత్రను తిరగేయండి

లోకంలో లక్షల్లో ప్రాణాలు హరీ అంటోంటే
మన నేలపై రెండంకెల్లో ఆగిపోయాయంటే
మన వైద్యుల అపార మేధస్సు, దీక్షాదక్షత

దైవ రూపంలోని నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల
వెలకట్టలేని సేవ, ప్రేమాభిమానాలు చిరస్మరణీయాలు

త్యాగం,శాంతి, పచ్చదనంతో శోభిల్లే
మన భూమి పై ఏ విష కణం బ్రతకజాలదు

ఈ కరోనా ఎంత?
ఎంత అదృష్టవంతులం మిత్రులారా
యుద్ధం చేసే సువర్ణ అవకాశం ఇది
కాలనాగులా బుసలు కొడుతున్న భూతాన్ని
మన స్వేచ్ఛ ను హరిద్దామని చూస్తున్న దెయ్యాన్ని
భూస్థాపితం చేద్దాం..విశ్వ విజేత గా నిలుద్దాం



– అట్లూరి వెంకటరమణ
9550776152

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి