జనవిజయంజాతీయంపీఎం యోగ అవార్డులకు నామినేషన్లు

పీఎం యోగ అవార్డులకు నామినేషన్లు

న్యూఢిల్లీ, మే 18 (జనవిజయం): ‘‘సత్యం మాట్లాడితే గందరగోళం ఎక్కడుంటుంది? మనసు స్వచ్ఛంగా ఉంటే వ్యాధి ఎలా వస్తుంది? శ్వాసను అదుపులో ఉంచితే మరణం ఎక్కడిది?’’ యోగ ప్రాధన్యతను తెలియచేస్తూ ప్రముఖ యోగ ప్రచారకుడు తిరుమలై కృష్ణమాచార్య పలుకులివి. అందుకే యోగకి అంకితం కావాలని కేంద్ర ప్రభుత్వం సైతం పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా యోగా ప్రమోషన్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. మోదీ చేసిన సాహసోపేతమైన ప్రయత్నం ఫలితంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరంభమైంది. ఈ రోజు యోగాను, అది విశ్వవ్యాప్తం కావడానికి భారతదేశం చేసిన కృషిని ప్రపంచం యావత్తు ప్రశంసిస్తోంది.

2016 సంవత్సరంలో రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యోగా అవార్డులను రెండు విభాగాలుగా ప్రకటించారు. వాటిలో ఒకటి అంతర్జాతీయ అవార్డు కాగా రెండోది జాతీయ అవార్డు. ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) నాడు ఈ అవార్డులను ప్రకటిస్తారు. 2021 జూన్ 21వ తేదీన ఐడివై నాడు ప్రదానం చేయనున్న ఈ అవార్డులకు నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. విజేతలకు ఒక ట్రోఫీ, సర్టిఫికెట్, రూ. 25 లక్షల నగదు అవార్డు బహూకరిస్తారు. యోగా వాస్తవ ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగపడుతుందని, తద్వారా మనలోని అంతర్గత వ్యవస్థ స్వచ్ఛంగా మారుతుందని యోగా గురు కె. పట్టాభి అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి