జనవిజయంజాతీయంనామాతో ఆగేనా..? కేసీయార్ దాకా సాగేనా..?

నామాతో ఆగేనా..? కేసీయార్ దాకా సాగేనా..?

  • తెలంగాణలో బిజేపి యుద్ధానికి సిద్ధమైందా?
  • నామా, ఈ.డీ స్పందనల తరువాత రాజకీయాలు మారనున్నాయా?
  • తెలంగాణలో బిజెపి యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా?
  • కే.సీ.ఆర్ ని జైలుకు పంపుతామంటున్న బండి సంజయ్ వ్యాఖ్యలు నిజం చేస్తారా?

మ్మం లోక్ సభ సభ్యుడు, లోక్ సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు హైదరాబాద్ ఇంట్లోనూ, మధుకాన్ సంస్థ కార్యాలయాలలోనూ శుక్రవారంనాడు ఇ.డి సోదాలు చేపట్టింది. పలు బ్యాంకిలలో లోన్లు తీసుకుని వాటిని విదేశాలకు తరలిస్తున్నారన్నది ఈ.డీ చేస్తున్న ఆరోపణ. గతంలో కేసు కొనసాగింపుగా ఈ దాడులు జరుగుతున్నాయా? రాజకీయ కారణాలున్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ నామా నాగేశ్వరరావు స్పందించలేదు. తెలంగాణలో దూకుడుగా వ్యవహరించాలన్న బిజెపి నిర్ణయించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలపై ఐ.టీ, ఇ.డీ దాడులు జరుపుతామని ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భంలో టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావుతో మొదలయిందనీ….తదుపరి కీలక నేతలపైనా ఈ దాడులు కొనసాగుతాయనే ప్రచారమూ సాగుతోంది. కే.సీ.ఆర్ పై కూడా దాడులు జరుగుతాయనీ, ఆయనను జైలుకు పంపుతామనీ బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి బిజెపి దూకుడు పెంచిందనీ, దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ అయిందనీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయ కోణంలో నామా పై ఈ.డీ దాడులు అంశం కలకలం రేపుతుండగా….. కేవలం నామాతో ఆగుతాయా….. మరిన్ని దాడులు కొనసాగుతాయా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు సంబంధం లేకుండానే ఈ.డీ తనపని తాను చేసుకుపోతోందా? అనేది తేలాలంటే నామా స్పందన, సోదాల అనంతరం ఏ ఆధారాలు దొరికిందీ ఈ.డీ ప్రకటన వెలువడితే గానీ ఈ అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి