జనవిజయంతెలంగాణనకిలీ విత్తాలను అమ్మేవారిపై పిడి యాక్ట్ - హెచ్చరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

నకిలీ విత్తాలను అమ్మేవారిపై పిడి యాక్ట్ – హెచ్చరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 1(జనవిజయం): నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. విత్తనాల లభ్యత, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష చేస్తూ 450 గ్రాముల పత్తి ప్యాకెట్ గరిష్ట ధర రూ. 767 దాటకుండా చూడాలని, అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు. తెలంగాణలో నకిలీ విత్తనాలతో రైతాంగం నష్టపోకండా చూడాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్రం ఖరారు చేసిన ధరకు మించి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంపెనీలు ఖచ్చితంగా నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి. ఎవరైనా సరే తిరస్కరించిన విత్తనాలు అమ్మితే కఠినంగా చర్యలుంటాయనీ.. పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. వర్సాకాలంలో గ్లైఫోసైట్ విక్రయాలపై నిషేధం విధించామని తెలుపుతూ, నిషేధిత గ్లైఫోసైట్ అమ్మితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ వానాకాలం 70 లక్షలు ఎకరాలు సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో పాటు వీడియో కాన్ఫరెన్సులో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్పీలు పాల్గొన్నారు.

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి