జనవిజయంతెలంగాణహైదరాబాద్ నగరంలో మళ్లీ పెరిగిన రద్దీ

హైదరాబాద్ నగరంలో మళ్లీ పెరిగిన రద్దీ

  • ఆర్టీసీ, మెట్రోలతో అందుబాటులోకి రవాణా
  • కేసులు తగ్గుముఖం పడడంతో బయటకు వస్తున్న జనం

హైదరాబాద్, జూన్ 1(జనవిజయం): లాక్ డౌన్ మినహాయింపులతో హైదరాబాద్ లో బస్సుల సర్వీసులను ఆర్టీసీ పెంచింది. ప్రతి డిపో నుంచి 50 చొప్పున బస్సులు నడుస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులు నడిచేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. దీంతో హైదరాబాద్ సిటీ బస్టాండ్ల వద్ద ప్రయాణీకుల రద్దీ పెరిగింది. 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉన్న సమయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగించడం.. ఆ తర్వాత మరో గంట సమయం ఇవ్వడంతో నగరంలో చాలా ప్రదేశాల్లో రద్దీ పెరిగింది. ఒక షిప్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచారు. దీనికి తోడు మెట్రో సర్వీసులకు కూడా మధ్నాహ్నానికి పొడించారు. దీంతో నగరంలో వివిధ పనలుకోసం వెళ్లేవారికి రవాణా సౌకర్యం పెరిగింది.

మరోవైపు నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసకుని తమ పనులకు వస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్, మే మొదటి వారంలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రజల్లో భయం పెరగడంతోపాటు కరోనా నివారణ మార్గాలను అనుసరించడం మొదలు పెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వడంతో కేసుల తీవ్రతపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో పది రోజులుగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పరీక్షా కేంద్రాలకు గతంలో వేలాదిమంది రాగా.. ప్రస్తుతం వందల సంఖ్యకు పడిపోయింది. పరీక్షా కేంద్రాలకు ప్రజల తాకిడి తగ్గడంతో నిమిషాల వ్యవధిలో పరీక్ష చేయించుకుంటున్నారు. గతంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలైన్ లో నిలబడితే తప్ప పరీక్ష చేయించుకోలే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం గంట వ్యవధిలోనే పరీక్ష చేయించుకుని వెళ్లిపోతున్నారు. కేసులు తగ్గుతుండడంతో కరోనా సెకండ్ వేవ్ నుంచి బయట పడ్డట్లుగా పలువురు భావిస్తున్నారు. దీంతో ఎవరి పనులకు వారు వెళుతున్నారు. అయితే భౌతిక దూరం పాటించడంలో మాత్రం ఇంకా చైతన్యం రావడం లేదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి