ఖమ్మం,జులై19(జనవిజయం):
నా పయనం బీఆర్ఎస్ తోటేనని పొంగులేటి ప్రధాన అనుచరుడు ఆకుల మూర్తి తెలిపారు. మంత్రి కేటీఆర్ పై పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. త్వరలోనే అన్ని విషయాలు మీడియా ముందు వెళ్లడిస్తానని ఆకుల మూర్తి అంటున్నారు. ఆయన బుధవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేటీఆర్ ని కలిశారు.