Thursday, October 5, 2023
HomeUncategorizedమువ్వా విజయ్ బాబు ను హత్య చేస్తామంటూ ..  సామజిక మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి...

మువ్వా విజయ్ బాబు ను హత్య చేస్తామంటూ ..  సామజిక మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు. ..పోలీస్ కమిషనర్ విష్ణు యస్ . వారియర్…

తప్పుడు ప్రచారాలను ప్రజలేవరూ నమ్మవద్దు

 

మువ్వా విజయ్ బాబు ను హత్య చేస్తామంటూ ..  సామజిక మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదు.

..పోలీస్ కమిషనర్ విష్ణు యస్ . వారియర్…

 

 జనవిజయం,01 జులై(ఖమ్మం): మువ్వా . విజయ్ బాబు ను చంపుతామంటు పోస్టర్లు వెలిసినట్లు మీడియా , సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలకు , వార్తలకు ఏలాంటి ప్రాధమిక అధారాలు పోలీసుల విచారణలో లభించలేదని , అదేవిధంగా ఈ ఘటనపై ఏవరు కూడా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయలేదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ . వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు .

ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సామజిక మాధ్యమాలలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు . ప్రధానంగా గతంలో ఎప్పుడు మువ్వా విజయ్ బాబు గారికి ప్రాణహాని వుందని అతను కాని వారి తరపున గాని ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు జిల్లాలో లేవని పేర్కొన్నారు . అదేవిధంగా ప్రస్తుతం పోలీస్ శాఖలో వున్న ( Threat perception ) ముప్పు జాబితాలో కూడా మువ్వా విజయ్ బాబు గారి పేరు లేదని స్పష్టం చేశారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఊహాజనితమైన తప్పుడు కధనాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పటిస్తూ ప్రశాంతంగా వున్న జిల్లాలో అలజడి సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలేవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments