Tuesday, October 3, 2023
Homeవార్తలుమురుగు నీటిలోనే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

మురుగు నీటిలోనే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు

  • మురుగు నీటిలోనే నడిచి పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
  • కన్నెత్తి చూడని ఆర్అండ్ బి అధికారులు
  • మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ సర్పంచ్, ఎస్ఎంసి చైర్మన్, తల్లిదండ్రుల డిమాండ్

బోనకల్, జూలై 19 (జనవిజయం):

మండల పరిధిలో, తూటికుంట్ల, ప్రొద్దుటూరు, లక్ష్మీపురం నుండి మండల కేంద్రానికి, వెళ్లే నిత్యం రద్దీగా ఉండే గోవిందాపురం జడ్పీఎస్ఎస్ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి అది. తరచుగా కురుస్తున్న వర్షాలతో గుంతలలో వర్షపు నీరు నిలిచి,పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. అలాగే అటుగా వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఈ గుంతలో నుంచి నడిచి పాఠశాలకు రావటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు జారీ అందులో పడటం వలన పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ దుస్తులు బురదమయం అవుతున్నాయి.

వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చే ప్రజలు వర్షం వచ్చిన ప్రతి సారి ఈ గుంతల నీటిలో నుంచి ప్రయాణించటం వలన ప్రమాదాలకు గురవుతున్నారు. కనుక అర్ అండ్ బి వారి వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. సర్పంచ్ ఉమ్మినెని బాబు, మాట్లాడుతూ రామాపురం, గార్లపాడు, లక్ష్మీపురం గోవిందపురం గ్రామాలకు కేంద్ర బిందువుగా ఉన్న జడ్పీఎస్ఎస్ గోవిందాపురం పాఠశాల ముందు మురుగునీరు నిలవడం చాలా బాధాకరంగా ఉందని గతంలో కంకర పొడితో మరమతులు చేయించిన, వర్షాల వల్ల వాహనాల తాకిడి వల్ల కొట్టుకపోయి మళ్లీ గుంటలు ఏర్పడ్డాయని, ఆర్ అండ్ బి అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసిన పట్టించుకోవట్లేదని,నిద్రవీడి మరమ్మతులు చేయించాలని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్ ఎం సి చైర్మన్ కారంగుల లక్ష్మణ్ మాట్లాడుతూ పాఠశాల ముందు మురుగునీరు గుంటల వలన పాఠశాల విద్యార్థులు రోగాల బారిన పడతారేమో అని విద్యార్థిని తల్లిదండ్రులు తమకు ఫోన్ చేసి మాట్లాడారని, అంతేకాకుండా ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించాలని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేశారని ఆయన తెలియపరిచారు.ఆర్ అండ్ బి అధికారులు వెంటనే మరుమ్మత్తులు చేయాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments