జనవిజయంజాతీయంముంచుకొస్తున్న యాస్ తుపాన్ ముప్పు

ముంచుకొస్తున్న యాస్ తుపాన్ ముప్పు

  • ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
  • సిఎంలతో సమీక్షించిన హోంమంత్రి అమిత్ షా
  • ఏపీ, ఒడిషాలకు 600కోట్ల చొప్పున నిధులు
  • బెంగాలకు 400కోట్లు విడుదలపై మమత ఆగ్రహం

న్యూఢిల్లీ మే24(జనవిజయం): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం తఫాన్‌గా మారింది. తీవ్ర తుఫాన్లో మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తఫాన్ ప్రభావం ఏవీవైన కూడా వడుతుండడంతో ప్రభుత్వం అవ్రవుత్తమైంది. ఇప్పటికే తుఫాన్ కారణంగా కోస్తాంధ్రలో ఉరుములు, మెరువులతో వర్షం వడుతోంది. తుఫాన్ దృష్ట్యా సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

రాయల సీమ జిల్లాల్లోనూ రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అటు కేంద్రం హోంమంత్రి అమిత్ షా కూడా తుఫాన్ వరిస్థితులపై ఆరా తీస్తున్నారు. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాల ఏవీ సహా మిగిలిన రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యాస్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇందులో సిఎం జగన్ కూడా పాల్గొన్నారు. యాస్ తుఫాన్ ఈ నెల 26న తీరం దాటే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ఒడిశాపశ్చిమ బెంగాల్ మద్య తీరం చేరుకొని.. అదేరోజు సాయంత్రం పారావ్ ? సాగర్ డవుల మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో 155 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావంతో ఒడిశా, బెంగాలలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మరోవైపు నైరుతి రుతువవనాలు బంగాళాఖాతంలో వరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆగ్నేయ తూర్పు-మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్నికోబార్ దీవుల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. రానున్న 12 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా, 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మార్చే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా ఏవీ, ఒడిశా, బెంగాల్ ముఖ్యమంత్రులతో పాటు అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్తో వర్చువల్ మిట్ నిర్వహించారు. యాస్ తుపాను సందర్భంగా ఆయా రాష్ట్రాలు చెవడుతున్న ముందస్తు చర్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రం తరవున ‘ముందస్తు నిధులు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు 600 కోట్ల ముందస్తుసాయం ప్రకటించారు. బెంగాలకు మాత్రం 400 కోట్ల రూపాయల ముందస్తు సాయం ప్రకటించారు. దీనివైనే బెంగాల్ సీఎం మమత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంఛన్ తుపాను కంటే యాస్ తుపాను ప్రమాదకారి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మారాష్ట్రం పెద్దది. జనాభాలోనూ పెద్దదే. అయినా బెంగాలను ఎందుకు వట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. మునువటి తుపాను నిధులే మాకు ఇంకా అందలేదని వవత ఆక్షేపించారు. అయితే యాస్ తుపాను నేపధ్యంలో వెయ్యి మంది విద్యుత్ టీమ్ లను, 450 టెలికాం టీమ్ లను రెడీగా ఉంచామని, తరలింపు కూడా ప్రారంభమైందని పేర్కొన్నారు. అలాగే 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నావుని వవత కేంద్ర హోంమంత్రి అవిత్వ దృష్టికి తీసుకెళ్లారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి