జనవిజయంతెలంగాణముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 37.79 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 37.79 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం,జూన్10(జనవిజయం): ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఇప్పటి వరకు 1542 మందికి 6.63 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందజేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇటీవలే వివిధ వైద్య చికిత్సలు పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధినుండి ఆర్ధిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారిలో రాష్ట్ర రవాణా శాఖామంత్రివర్యుల సిఫారసు మేరకు 94 మందికి మంజూరైన 37.79 లక్షల విలువైన చెక్కులను గురువారం సాయంత్రం వీ.డి. ఓస్ కాలనీలోని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.

కరోనా విపత్కర పరిస్థితులలో ఆర్ధిక ఇబ్బందులున్నప్పటికి పేద నిరుపేదలకు లబ్ధి చేకూర్చే ఏ ఒక్క కార్యక్రమానికి ఆటంకం కలుగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు గారు నిధులను మంజూరు చేస్తున్నారని మంత్రి తెలిపారు. కోవిడ్ ఉదృతిని పూర్తిగా నివారించేందుకు ప్రజలు తమవంతుగా స్వీయ నియంత్రణ పరిరక్షణ చర్యలు పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ప్రజలను కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ షేక్ ఫాతిమా జోహరా, ఆయా డివిజన్ల కార్పోరేటర్లు కమర్తపు మురళి, కర్ణాటి కృష్ణ, మెట్, కూరాకుల వలరాజు, హుస్సేన్, పి. రోజిలిన్, జి. చంధ్రకళ, దాదే ధనలక్ష్మీ, యం. ప్రసాద్, రఘునాథపాలెం జడ్పీ.టి.సి మాణోతు ప్రియాంక, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం నూతన ఆర్.టి.సి బస్ స్టాండ్ ను మంత్రి ఆకస్మికంగా సందర్శించి ఆర్.టి.సి అధికారులకు పలు సూచనలు చేశారు. బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, పార్శిల్ సర్విసు, వెయింటింగ్ హాల్, మూత్రశాలల నిర్వహణను పర్యవేక్షించాలన్నారు. నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, ఆర్.టి.సి. డి.వి.ఎం సుగుణాకర్, డి.ఎం. శంకర్ రావు, అసిస్టెంట్ మేనేజర్ స్వామి, డి.ఇ భాస్కర్, శివప్రసాద్, శ్రీనివాస్, ఆర్.టి.సి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి