జనవిజయంజాతీయంముదురుతున్న సేవ్ లక్ష ద్వీప్

ముదురుతున్న సేవ్ లక్ష ద్వీప్

  • లక్షద్వీప్ లో అడ్మినిస్ట్రేటర్ చిచ్చు
  • తీవ్రమవుతోన్న సేవ్ లక్షద్వీప్ ఉద్యమం

తిరువనంతపురం,మే28(జనవిజయం): కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవుల్లో కొత్త అలజడి రగులుతోంది. అక్కడి అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి అడ్మినిస్ట్రేటర్ తీరుపై లక్షద్వీప ప్రజలు భగ్గుమంటున్నారు. తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ‘సేవల్ లక్ష ద్వీప్’ పేరుతో ఏకంగా ఉద్యమానికి తెరలేపారు. అక్కడి ఉద్యమాలతో ఇప్పుడు అందరి దృష్టి లక్షదీవుల వైపు మళ్లింది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్లుగా విశ్రాంత ఉన్నతాధికారులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. గతేడాది వరకు నిఘా విభాగం చీఫ్ గా పని చేసిన దినేశ్వర్ శర్మ అడ్మినిస్ట్రేటర్ గా ఉండేవారు. 2020 డిసెంబరు 4న దినేశ్వర్ శర్మ మరణించారు. దినేశ్వర్ శర్మ స్థానంలో గుజరాత్ మాజీ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు నన్నిహితుడైన ప్రఫుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ప్రఫుల్ పటేల్ రాకతో లక్షదీవుల్లో సమస్యలు

మొదలయ్యాయి. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు ప్రజల్లో అసంతృప్తికి ఆజ్యం పోసింది. కేరళలోని కొచ్చికి 150-200 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఈ లక్షద్వీప్ ఉంది. 10 ద్వీపాల్లో ప్రజలు నివశిస్తారు. ఇక్కడి జనాభా సుమారు 64 వేలు. ఇందులో ముస్లింలను షెడ్యూల్ తెగలుగా పరిగణిస్తారు. లక్షద్వీప్ ప్రజలంతా మలయాళ మాండలికమైన జెసెరీ భాష మాట్లాడతారు. మినికోయ్ ప్రజలు మాత్రం మహాల్ అనే భాష ఉపయోగిస్తారు. విద్య, వైద్యం కోసం వీరు ప్రధానంగా కేరళపై ఆధారపడతారు. ఎంతో ప్రశాంతంగా ఉండే లక్ష ద్వీప్ ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనా పగ్గాలు అడ్మినిస్ట్రేటర్ చేతుల్లో ఉంటాయి. లక్షద్వీప్ లో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తాజాగా జారీచేసిన క్రూరమైన ఉత్తర్వులపై వెంటనే జోక్యం చేసుకొని, వాటిని ఉపసంహరించుకునేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మోడీకి ఒక లేఖ రాశారు. ఈ కొత్త నిబంధనలు, ఆదేశాలు ద్వీప ప్రజల జీవితాలకు, వారి జీవనోపాధి, అక్కడి సంస్కృతికి ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. లక్షద్వీప్ తరతరాలుగా సహజమైన ప్రకృతి సౌందర్యానికి, ప్రత్యేక సంస్కృతుల సంగమానికి ప్రతీక అని, దీని వారసత్వాన్ని పాలకులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో అక్కడి ప్రజల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. లక్షద్వీప్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతో కూడా ప్రఫుల్ కనీసం సంప్రదింపులు చేయకుండా ఏకపక్ష మార్పులను ప్రతిపాదించారని, ఇటువంటి ఏకపక్ష చర్యలను వారు తీవంగా వ్యతిరేకిస్తున్నారని, ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి