MSN(R&D) కంపెనీ సీనియర్ హెచ్.ఆర్ తో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను చర్చించిన BSP నాయకులు
హైదరాబాద్,16 సెప్టెంబర్(జనవిజయం)
బహుజన సమాజ్ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధినేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఏ.నటరాజ్ ఆదేశాల మేరకు బి.ఎస్.పి.పటాన్ చెరువు నియోజకవర్గ నాయకులు MSN(R&D) కంపెనీ సీనియర్ హెచ్.ఆర్ ను కలసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను చరించారు.
ఈ సందర్భంగా BSP నాయకులు మాట్లాడుతూ., కొందరు కాంట్రాక్టర్లు కార్మికుల పైడ్ హాలిడే కి ఇస్తున్న వేతనాలను కార్మికులకు ఇవ్వకుండా వారి జేబులను నిపుకుంటున్నట్లు వారి దృష్టికి వచ్చిందని ఆ విషయాన్ని సీనియర్ హెచ్.ఆర్ దృష్టికి వెళ్లగా ఇంటర్నల్ ఎంక్విరీ నిర్వహించి కార్మికులకు న్యాయం చేస్తాం అని హామీ ఇచ్చినట్లు తెలిపారు.కార్మికులకు న్యాయం జరగపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BSP నాయకులు నటరాజ, శ్రీశైలం,నర్సింగరావు,చంద్రశేఖర్ మరియు ఫారీద్ పాల్గొన్నారు.