Tuesday, October 3, 2023
Homeవార్తలుమృతదేహంతో శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఎదుట ఆందోళన

మృతదేహంతో శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఎదుట ఆందోళన

మృతదేహంతో శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఎదుట ఆందోళన

  • ఆసుపత్రి ఎదుట భారీగా మోహరించిన పోలీసులు

ఖమ్మం, జూలై 26 (జనవిజయం) :

ఓ డాక్టర్ నిర్వాహకంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు తన నిర్లక్ష్య వైద్యానికి ఓ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఖమ్మం నగరంలోని చోటుచేసుకుంది. మృతదేహంతో బంధువులు శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఎదుట బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన రేపాల వీరయ్య (45) అనే పేషెంట్ అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం మయూరి సెంటర్ లోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రికి వచ్చి డాక్టర్ ను సంప్రదించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాధితునికి స్టంట్ అవసరమని వైద్యుడు సూచించాడని, అందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవాలని డాక్టర్ చెప్పాడని మృతిని బంధువులు తెలిపారు. అనంతరం ఆరోగ్యశ్రీ ద్వారా స్టంట్ వేశారని, స్టంట్ వేసిన మూడు రోజులకే తీవ్రగుండె నొప్పి రావడంతో అదే ఆసుపత్రికి వస్తే డాక్టర్ స్టంట్ ఫెయిల్ అయిందని 6 లక్షలు అవసరమవుతుందని డాక్టర్ తెలిపాడని మృతుని బంధువులు ఆరోపించారు.

తీవ్ర గుండెనొప్పితో బాధపడుతుంటే స్టంట్ ఫెయిల్ అయిన విషయాన్ని నేరుగా పేషెంట్ కు చెప్పడంతోనే, పేషెంట్ తీవ్ర ఆందోళన గురై మృతి చెందడానికి డాక్టర్ కారణమయ్యాడని మృతిని బంధువులు ఆరోపించారు. మృతదేహంతో ఆసుపత్రి ఎదుట మృతుని బంధువులు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఆస్పత్రి వర్గాలు మృతిని బంధువులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మృతిని బంధువులు ఆందోళన విరమించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments