జనవిజయంఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు

  • ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్‌
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌

అమరావతి,మే21(జనవిజయం): ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్‌ ఇచ్చింది. గతంలో నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించామని.. కౌంటింగ్‌కు అనుమతించాలని.. ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. కాగా.. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేసారు. అలాగే జనసేన, బీజేపీ నేతలు సైతం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తొలుత విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి… ఎన్నిక పక్రియను నిలిపేస్తూ ఏప్రిల్‌ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన డివిజన్‌ బెంచ్‌.. ఓట్ల లెక్కింపును చేపట్టవద్దని ఆదేశించింది. పోలింగ్‌ అనంతరం ఇరుపక్షాల తరుఫున హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణను పూర్తి చేసిన హైకోర్టు తాజాగా ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఊహించని షాక్‌ ఇస్తూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించిన బీజేపీ నేత, పిటిషనర్‌ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ సత్యమేవ జయతే అధర్మమనేది కొన్నిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత ధర్మం వస్తుందన్నారు. అధికారపార్టీ ఎన్నికల్లో ఇతర పార్టీకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అరాచకం సృష్టించి.. పోలీసులతో కేసులు పెట్టించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని నాగభూషణం అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని హైకోర్టు తీర్పును మెవరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును గౌరవించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాని పాతూరి డిమాండ్‌ చేసారు. ఈ ఆదేశాలతో అధికార పార్టీ కళ్లు తెరవాలన్నారు. కోర్టు తీర్పుపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ…సుప్రీం కోర్టు మార్గదర్శకాలకి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు. కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు జరపాలి అని సంచలన తీర్పు ఇచ్చిన హైకోర్ట్‌ తీర్పును ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు.. ప్రభుత్వం ఇప్పటికైనా పద్దతి మార్చుకుని చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి ట్వీట్‌ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పందించిన ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరిపోసే తీర్పుగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా.. తాజా నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని పవన్‌కళ్యాణ్‌ సూచించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి