దేశప్రతిష్ట మంటగలుస్తుంటే ప్రధాని మౌనంగా ఉంటారా!?
- మణిపూర్ ఘటనలను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలి!
- మహబూబాబాద్ ఎం.పి మాలోత్ కవిత
భద్రాచలం, 22 జూలై(జనవిజయం):
మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించడం..అత్యాచారాలు చేయడం తీవ్రంగా కలిచివేసిందని మహబూబాబాద్ ఎం.పి మాలోత్ కవిత ఓ ప్రకటన తెలిపారు.
దేశంలో శాంతిభద్రతలు క్షీణించాయని,కేంద్రప్రభుత్వం ప్రేక్షకపాత్ర విడిచి. తక్షణమే స్పందించి మణిపూర్ ను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏ నాగరిక సమాజం మణిపూర్ లో జరిగిన దారుణాన్ని క్షమించదు.. సహించదని అన్నారు.ప్రధానమంత్రి మోదీ., రక్షణమంత్రి అమిత్ షా ప్రకటన చేసాం…, పని అయిపోయిందనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తక్షణ చర్యలు చేపట్టకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తపరిచారు. మణిపూర్ ఘటనలను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.