జనవిజయంతెలంగాణయువత పర్యావరణాన్ని కాపాడడంలో ముందుండాలి - డివైఎఫ్ఐ నేత రమేష్ పిలుపు

యువత పర్యావరణాన్ని కాపాడడంలో ముందుండాలి – డివైఎఫ్ఐ నేత రమేష్ పిలుపు

  • యువత పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలి
  • సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండాలి
  • డి.వై.యఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ పిలుపు
  • ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా చిమ్మపుడి హైస్కూల్ లో మొక్కలు నాటిన డి. వై. యఫ్ ఐ కార్యకర్తలు

రఘునాధపాలెం,జూన్5 (జనవిజయం) : నేటి యువత పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని, సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండాలని డి.వై.యఫ్.ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ యువతి, యువకులకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా స్థానిక చిమ్మపుడి హైస్కూల్ లో డి. వై. యఫ్.ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ప్రాణ వాయువుని అందించే చెట్లను ప్రతి ఒక్కరు ఒక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని, నేడు కరోన విపత్కర పరిస్థితుల్లో ఆక్సీజన్ అందక వేల మంది చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పర్యావరణాన్ని అందరూ కాపాడాలని, చెట్లను నరకవద్దని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ ని, రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, వీటి పేరుతో కొన్ని గ్రామలలో అవినీతి జరుగుతుందని, నర్సరీలను పెంచి, గ్రామాలలో ప్రజలకు మొక్కలు పంచి నాటించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వాలు కూడా కేవలం ప్రచారం కోసం స్వచ్ఛ భారత్, హరితహారం అన్న పేర్లు పెట్టి మొక్కలు హడావిడిగా నాటి వదిలివేస్తున్నారని, ఆ చెట్లు పెరిగి పెద్ద అయ్యేంత వరకు భాద్యత తీసుకోవాలని ఆయన కోరారు. నేటి యువత పర్యావరణ పరిరక్షణకై చెట్లను నాటి పెరిగి పెద్ద అయేంత వరకు బాధ్యతగా పెంచాలని అనేక సామాజిక, సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి.వై. యఫ్. ఐ గ్రామ అధ్యక్షుడు దశరద.వీరబాబు, డి.వై.యఫ్.ఐ గ్రామ నాయకులు రాచర్ల.నరేష్, దొంతూ.గణేష్, ప్రకృతి ప్రేమికులు వలపిన్ని రాజేష్, పరిమిశెట్టి రమేష్, డి.వై.యఫ్.ఐ నాయకులు లోహిత్ రెడ్డి, దనియకుల.సాయిరాం, బండి.సతీష్, శెట్టి.నరేష్, రాచర్ల నందు, గాడిచర్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి