జనవిజయంఆంధ్రప్రదేశ్వ్యాక్సినేషన్ ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వొద్దు - ప్రధానిని కోరిన ఏపీ సీఎం జగన్

వ్యాక్సినేషన్ ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వొద్దు – ప్రధానిని కోరిన ఏపీ సీఎం జగన్

  • ప్రధాని మోడీకి సిఎం జగన్ లేఖ
  • ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదు
  • 24 గంటల్లో కరోనాతో 118 మంది మృతి

అమరావతి, మే22(జనవిజయం): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శనివారం రాసిన ఆ లేఖలో.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరత వల్ల కేవలం 45ఏళ్ల పైబడిన వాళ్లకే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో రూ.2వేల నుంచి 25వేల వరకు విక్రయిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వ్యాక్సిన్ అనేది ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాల్సిన విషయం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఒక వైపు 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నాం. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. దీని వల్ల సామాన్యులు వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సినను బ్లాక్ మార్కెట్ చేస్తారు. సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉంటే.. ఎవరికైనా ఇవ్వొచ్చు. ఒక వైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు?. వ్యాక్సిన్లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలి. వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్ కు చేరకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 19,981 కరోనా కేసులు నమోదయ్యా యి. శనివారం నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 15,62,060కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 118 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 10,022 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 2,10,683 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 13,41,355 మంది రికవరీ అయ్యారు. కొత్తగా పశ్చిమగోదావరి జిల్లాలో 15, చిత్తూరు జిల్లాలో 14 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 11 మంది చొప్పున మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 10 మంది, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. కరోనాతో కడప జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి