జనవిజయంతెలంగాణమోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కే.సీ.ఆర్ కు లేదా? - బండి సంజయ్

మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కే.సీ.ఆర్ కు లేదా? – బండి సంజయ్

హైదరాబాద్, జూన్8 (జనవిజయం) : కేంద్రం ఉచిత వ్యాక్సిన్ ఇస్తుందని కేసీఆర్ బాధపడుతున్నారని, అందుకే ప్రధానికి కృతజ్ఞతలు చెప్పలేదని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని సూచించారు. ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం పట్ల తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు ఉచిత వేక్సిన్ సదుపాయాన్ని కల్పించిన ప్రధాని మోడీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు చెపుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. జూన్ లో 20, జులైలో 20 లక్షల వ్యాక్సిన్ డోసులు తెలంగాణకు వచ్చే అవకాశముందన్నారు.తెలంగాణకు ఇప్పటికే కేంద్రం  80 లక్షల డోసులు ఇచ్చిందని సంజయ్ తెలిపారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసుకోబట్టే దేశం  రూ.లక్షల కోట్లు నష్టపోకుండా ఉందన్నారు. మోదీ నిర్ణయం పట్ల పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు చెబుతుంటే కేసీఆర్ పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం అందించే అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కరోనా కట్టడికి రూ.2,500 కోట్లు కేటాయించానని సీఎం చెప్పారు.. ఆ నిధులు ఎక్కడిపోయాయని ప్రశ్నించారు. రూ.500 కోట్లు కేటాయిస్తే శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించుకోవచ్చని సూచించారు. ఇప్పటికైనా వైద్యులు, సిబ్బంది నియామకానికి సీఎం చర్యలు చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి