సిపిఎం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
- రింగ్ రోడ్డుపై రాస్తారోకో
సత్తుపల్లి, జూలై25 (జనవిజయం):
మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు ఖండిస్తూ సిపిఎం సత్తుపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ముందుగా భారీ రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఎం పట్టణ కార్యదర్శి రావుల రాజబాబు,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు లు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తూ మాట్లాడకుండా మౌనం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ,మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి తెగలు మధ్య జరుగుతున్న పోరును పరిష్కారం చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ద వహించి దృష్టి పెట్టకుండా కుల,మత,లింగ బేధం పేరుతో ప్రోత్సహించడం దుర్మర్మాగమని అన్నారు.అక్కడ ఆదివాసి మహిళలపై జరిగిన వరుస దాడులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి,ప్రధాని నోరు మెదపకుండా స్పందించకుండా ఉండటాన్ని సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు కొలికిపోగు సర్వేశ్వరరావు, రమేష్, బడే మియా, సైదా, వలి, వెంకటేష్, వెంకటేశ్వరరావు, చంద్రం, బుడే, రవి, కిరణ్, రాము, శ్రీను, వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.