మొదటి ప్రమాద హెచ్చరిక ను దాటి ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం, జూలై 20 (జనవిజయం):
భద్రాచలం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక ను దాటి ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటలకు 43.30 అడుగులకు చేరినట్లు కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గోదావరి నుండి 9 లక్షల 46 వేల 412 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులు వచ్చినందున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆమె చెప్పారు. వరద ఉదృతి దృష్ట్యా చేపట్టిన రక్షణ చర్యలకు ప్రజలు జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం తో పాటు, ఐటీడీఏ కార్యాలయం లో కూడా వరద సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు.
ముంపుకు గురైన రామాలయం ప్రాంతం