జనవిజయంఆరోగ్యంకోవిడ్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మోబైల్ వాహనాల వైద్య సేవలు -...

కోవిడ్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మోబైల్ వాహనాల వైద్య సేవలు – మంత్రి పువ్వాడ

ఖమ్మం,జూన్10(జనవిజయం): కోవిడ్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మోబైల్ వాహనాల వైద్య సేవలను అందుబాటులోకి తేవడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కోవిడ్ బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలతోపాటు వీరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో హైద్రాబాదులో ఇటీవలే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కె.తారకరామారావు మోబైల్ మెడికల్ యూనిట్ బస్సులను జిల్లాలకు కేటాయించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు వచ్చిన మోబైల్ ఐ.సి.యు బసను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి రోటరీనగర్ లో గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. తొలి విడత రాష్ట్రంలో 30 మోబైల్ ఐ.సి.యూ మెడికల్ యూనిట్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు లార్డ్స్ చర్చి ప్రతినిధులు వెల్లడించారు. మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవలతో పాటు ల్యాబ్, డాక్టర్, నర్సింగ్ సిబ్బంది, ఆక్సీజన్ తో కూడిన పది బెడ్స్ ఏ.సి సౌకర్యంతో అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మోబైల్ మెడికల్ యూనిట్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చి భాద్యులకు, వైద్య సేవలు అందిస్తున్న వీరా హెల్త్ కేర్ బాధ్యుతలకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ వైద్య సేవలలో భాగస్వాములయినందుకు ఈ సందర్భంగా వారిని అభినందించారు. బస్సులను ప్రారంభించిన అనంతరం బలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను మంత్రి పరిశీలించారు. నగరమేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా||మాలతి, పాస్టర్ సత్యపాల్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి