జనవిజయంతెలంగాణగర్భిణి ఆపరేషన్ కు కవిత చేయూత

గర్భిణి ఆపరేషన్ కు కవిత చేయూత

ఖర్చులు భరించేందుకు అంగీకారం

హైదరాబాద్,మే24(జనవిజయం): టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కోన్దికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతిబాయి మరిది ట్విట్టర్లో సహాయం కోసం అభ్యర్థించాడు. మననున్న కొంతమంది మంచి మనుషులు స్పందించారు. కొంత మొత్తం నగదు జమైంది. కానీ ఆపరేషన్ ఖర్చుకు అది ఎంత మాత్రం సరిపోదు. మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అయితే జ్యోతి బాయి గురించి ఎమ్మెల్సీ కవితకు తెలియడంతో ఆ కుటుంబానికి ఓదార్పు దక్కింది. జ్యోతి బాయి ఆపరేషన్ ఖర్చును భరిస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ చేయడంతో పండండి బిడ్డకు జ్యోతిబాయి జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ఎమ్మెల్సీ కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన సహాయంతో జ్యోతిబాయి భర్త, మరిది భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మేడం స్పూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేస్తామని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్ లు అయిన వారు ఇక నుంచి తాము గర్భిణీలను ఉచితంగా హాస్పిటల్స్ కు తీసుకుపోతామని ప్రకటించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి