భద్రాచలం, జూలై 18 (జన విజయం):
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే పొడెం వీరయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును బేషరతు గా వెనక్కి తీసుకావాలని ఈ సందర్భం గా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు అరికెళ్ళ తిరుపతి రావు డిమాండ్ చేసేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, నూగూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోదే బోయిన బుచ్చయ్య , నాయకులు నక్కా ప్రసాద్, చింతాడి చిట్టిబాబు,మల్లా రాంబాబు, గ్రంథాలయం చైర్మన్ మామిడి పుల్లారావు, కనకదుర్గ దేవస్థానం చైర్మన్ చింతాడు రామకృష్ణ దిశ కమిటీ సభ్యులు లకావత్ వెంకటేశ్వర్లు ఎస్టీ సెల్ అధ్యక్షులు అంబటికార కృష్ణ , ఏ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల శ్రీను, సీనియర్ మహిళా నాయకులు వీర్ల భారతి, మాజీ ఎంపీటీసీ మానే కమల, సత్యవేణి, పద్మప్రియ, మరియమ్మ , వేదామని, మల్లా ప్రతాప్, యూత్ డివిజన్ అధ్యక్షులు మల్లెల లోకేష్ తదితరులు పాల్గొన్నారు.