Tuesday, October 3, 2023
Homeవార్తలుఎమ్మెల్యే గారూ! అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హామీ ఏమైంది?

ఎమ్మెల్యే గారూ! అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు హామీ ఏమైంది?

భద్రాచలం, ఆగస్ట్ 21 (జనవిజయం): రెండు సంవత్సరాల క్రితం భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని మీరు ఇచ్చిన హామీ ఏమైందని భద్రాచలం ఎమ్మెల్యే ను అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ కన్వీనర్ పూనేం వీరభద్రం ప్రశ్నించారు. స్థానిక పాత మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ సమావేశంలో పూనేం వీరభద్రం మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం ఆనాటి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వం ద్వారా భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్న సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యే గారి అనుచరులు భద్రాచలం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నేనే ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారి ద్వారా హామీ తీసుకోవడం జరిగింది. రెండు సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఎటువంటి ముందడుగు పడలేదు అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు హామీని ఎమ్మెల్యే గారు మర్చిపోయారేమో అనుకుంటున్నాము. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నాము. ఈనెల 27వ తారీఖున భద్రాచలం పట్టణంలో గిరిజన అభ్యుదయ భవనంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయుచున్నామని తెలిపారు. ఈ సమావేశానికి పట్టణంలో పట్టణంలో ఉన్న అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు, బిసి, ఎస్సీ, ఎస్టీ పాల్గొనాలని అంబేద్కర్ విగ్రహ సాధన కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. ఈ సమావేశంలో భద్రాచలం ఆదివాసి సమితి అధ్యక్షులు పూనేం కృష్ణదోర, పూనేం నాగేశ్వరరావు, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments