Tuesday, October 3, 2023
Homeవార్తలు"మిషన్ ఇంద్రధనస్సు" కార్యక్రమం ప్రారంభించిన భద్రాద్రి కలెక్టర్

“మిషన్ ఇంద్రధనస్సు” కార్యక్రమం ప్రారంభించిన భద్రాద్రి కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం, ఆగష్టు 07 (జనవిజయం): పాల్వంచ మండలం ఇందిరానగర్ ప్రాథమిక వైద్య కేంద్రంలో సోమవారం మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ప్రారంభించారు. మిషన్ ఇంద్ర ధనుష్ టీకా కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకోవాలని ఈ సందర్భం గా ఆమె సూచించారు.

జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో నేటి నుండి 12 వ తేదీ వరకు మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించుకోని 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను, గర్భిణీలను గుర్తించడం జరిగిందని, ఇప్పటి వరకు టీకాలు వేయించుకోని పిల్లలను, గర్భిణీలను, మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రత్యేక సెషన్లలో టీకాలు వేయడం జరుగుతుందని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments