మైనార్టీల అభివృద్ధి బిఆర్ఎస్ తోనే
- మైనార్టీలకు లక్ష సహాయం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కారేపల్లి, జూలై25(జనవిజయం):
బీసీల మాదిరిగా మైనార్టీలకు కూడా రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం కారేపల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఆదేశానుసారం మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, మైనార్టీ అధ్యక్షుడు షేక్ గౌస్ పాషా, కో ఆప్షన్ ఎండి హనీఫ్ ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు ప్రభుత్వం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముత్యాల సత్యనారాయణ, సర్పంచ్ బాణోత్ కుమార్, మండల సోషల్ మీడియా కన్వీనర్ భూక్య రాంకిషోర్ నాయక్, మండల మైనార్టీ నాయకులు షేక్ మునురుద్దీన్ పటేల్, ఎండి షాదిక్ అలీ, షేక్ శంషుద్దీన్, యాకుబ్ భాష, షేక్ మీరా, సయ్యద్ అజ్మద్, యువజన నాయకులు బాణోత్ కోటి, గుగులోత్ హారు, నాయకులు సాయిని తిరుపతయ్య, మణికొండ నాగేశ్వరరావు, వాంకుడొత్ కరణ్ సింగ్, తొగరు రమేష్, భూక్య రాంకి, తొగరు శ్రీను, అదేర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.