పెద్దబీరవల్లి గ్రామంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు విజయవంతం
సిఐటియూ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్
బోనకల్, జూలై 21(జనవిజయం):
మండల పరిధిలోని పెద్దబీరవల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో సిఎస్సి(కామన్ సర్వీస్ సెంటర్) హెల్త్ కేర్ ఖమ్మం వారి హెల్త్ క్యాంపు ని గ్రామ సర్పంచ్ అల్ల పుల్లమ్మ , ఎంపిటిసి కర్లకుంట్ల దేవమణి ప్రారంభించారు.లేబర్ కార్డు కలిగి ఉండి 18 నుండి 60 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారికి బిపి ,షుగర్, థైరాయిడ్, సిబిపి (కంప్లీట్ బ్లడ్ పిక్చర్), క్యాన్సర్ తో పాటు దాదాపు 50 రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.ఈ హెల్త్ క్యాంప్ గ్రామంలోని లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకున్నారు. కోరారు.ఈ క్యాంపులో హెల్త్ కేర్సిసిజి శ్రీనివాసరావు, డాక్టర్ సాయికిరణ్ ఎండీ,టీం,గ్రామ పెద్దలు చింతలచెర్వు కోటేశ్వరరావు,పెద్దప్రోలు కోటేశ్వరరావు, రెడ్డబోయిన ఉద్దండు,ఉసికల సురేష్, పుల్లారావు భవన నిర్మాణ రంగం నాయకులు తదితరులు ఉన్నారు.