Saturday, February 24, 2024
Homeరాజకీయంమేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం

  • సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ
  • విచారణ తరవాత చర్యలు తప్పవు
  • విూడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేంవత్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి10:

మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తమని, విచారణ తర్వాతే చర్యలుంటాయని  సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత ఆయన విూడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గత ప్రభుత్వం మాదిరి తాము అబద్దాల బడ్జెట్‌ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని భూములకు కూడా రైతుబంధు వెళ్తుందన్నారు. బీఏసీకి  హారీష్‌ రావును అనుమతించని అంశంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. బిఏసీ కి హాజరయ్యే పేర్లను బీఆర్‌ఎస్సే ఇచ్చిందని అందులో ఎవరి పెరు ఉంటే వారిని పిలుస్తారన్నారు. హరీష్‌ రావు అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతున్నారని  మండిపడ్డారు.  గతంలో బీఏసీ లో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయో అవి అమలు అవుతున్నాయన్నారు.

తన భాషపై బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శల్ని రేవంత్‌ తిప్పి కొట్టారు. తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానన్నారు. అబద్దాల ప్రాతిపదికన  బడ్జెట్‌  పెట్ట దలచుకోలేదు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ పెట్టాం. అబద్దాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్దాలు చెప్పాలన్నారు.  మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కవిూషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వంలాగే అవుతుందన్నారు.  రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్దిలో ఏ పార్టీ ఎమ్మెల్యేలను అయినా కలుపుకుని పోతామని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఇరిగేషన్‌ పై సభలో శ్వేతా పత్రం ఇరిగేషన్‌ మంత్రి విడుదల చేస్తారని ప్రకటించారు.  అమరవీరుల స్థూపం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపై విచారణ జరిపిస్తాం. విజిలెన్స్‌ విచారణ జరిపాం. జ్యుడిషియల్‌ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్నారు.   మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించామని  13న బీఆర్‌ఎస్‌ వాళ్ళకి  విూటింగ్‌ ఉంటే ఒకరోజు ముందు వెనక వెళదాం అన్నా మేం రెడీ అని ప్రకటించారు.  పదేండ్లు అయినా కేసీఆర్‌కి  బడ్జెట్‌  అంచనా వేయడం రాలేదు. వాస్తవాలకి అనుగుణంగా  బ్జడెట్‌ ప్రిపేర్‌ చేసినందుకు భట్టి కి అభినందనలు తెలిపారు. ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ లో చేరుతారని జగ్గారెడ్డి చేసినవ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. బిఅరెస్‌ ఎమ్మెల్యే ల చేరిక పై జగ్గారెడ్డి మాకు చెప్పలేదన్నారు.  చెబితే అధిష్టానంతో మాట్లాడుతామన్నారు. ఎవరైనా సీఎంను కలవవచొచ్చని వారిపై వాళ్ల పార్టీలో అనుమానం ఉంటే తాను ఏవిూ చేయలేనన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌ రెడ్డి వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడంపై ఆయన ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తేల్చేందుకు జ్యూడీషియల్‌, విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పుడు మరో బాంబ్‌ పేల్చారు. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్‌ విగ్రహం, సచివాలయం నిర్మాణాలలో అవినీతి జరిగిందన్నారు. వీటిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్‌ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై అన్ని విధాలుగా విచారణ చేపడతామన్న సీఎం రేవంత్‌ రెడ్డి. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్‌ విచారణ జరిపించారు. జ్యూడీషియల్‌ విచారణ చేపడుతున్నారు. జ్యుడిషియల్‌ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయని చెప్పారు సీఎం. మేడిగడ్డకు వెళ్దామని ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించానని చెప్పిన సీఎం 13వ తేదీన బీఆర్‌ఎస్‌ వాళ్లకు విూటింగ్‌ ఉంటే వేరే తేదీ చెప్పినా తాము ఆలోచిస్తామన్నారు. ఒకరోజు ముందు లేదా వెనుక వెళదాం అన్నా తాము సిద్ధం అని ప్రకటించారు సీఎం రేవంత్‌ రెడ్డి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments